కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) అద్భుతమైన బ్యాటింగ్ వల్ల ముంబై ఇండియన్స్ ( Mumbai Indian ) మరో విజయం సాధించింది. అదే సమయంలో జస్ప్రీత్ బూమ్రా, ట్రెంట్ బోల్డ్ లు బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. రసేల్, నరైన్, మోర్గాన్ ఫామ్ లో కనిపించలేదు. దాంతో భీకరమైన బ్యాట్స్ మెన్ ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ .. ఆల్ రౌండర్స్ తో నిండి ఉన్న ముంబై ఇండియన్స్  ముందు నిలబడలేక చేతులెత్తేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి


ఫైనల్ గా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 ( IPL 2020 ) లో బోణీ కొట్టింది. కోల్ కతా నైట్ రైడర్స్ పై ముంబై ఇండియన్స్ 49 పరుగులతో విజయం సాధించింది.


ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ రోహిత్ శర్మ శుభారంభం ఇచ్చాడు. 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇందులో మూడు బౌండరీలు, ఆరు సిక్కర్లు ఉన్నాయి. 20 ఓవర్లలో ముంబై జట్టు 195 పరుగులు చేసింది. 196 టార్గెట్ లో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ ( KKR ) టీమ్ కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫైనల్ లో 12 బంతుల్లో 33 పరుగులు చేసినా టీమ్ గెలవలేకపోయింది. 



ALSO READ| IPL: ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే


అరుదైన రికార్డు సాధించిన హిట్ మ్యాన్
ముంబై ఇండియన్ కెప్టెన్ రోహితఖ్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచులో ఆరు సిక్సులు బాదిన రోహిత్ శర్మ ఐపీఎల్ లో మొత్తం 200 సిక్సులు బాదిన క్రీడాకారుల జాబితాలో చేరారు. అయితే ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో క్రిస్ గేల్ ( 316 ), ఏబీ డివిలియర్స్ ( 214 ) , ధోనీ (212 )య తరువాతి స్థానంలో ఉన్నారు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే     ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR