Surya kumar Yadav: ఐపీఎల్‌-2022లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై జట్టుకు మరో షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు ఈ సీజన్‌కు దూరమైయ్యాడు. ఈటోర్నీలో 11 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన తొమ్మిదింటిలో ఓడిపోయి..రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇంకా మూడు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత ఐపీఎల్‌లో సీజన్‌లో ముంబై జట్టుకు ఏది కలిసి రావడం లేదు. ఎన్ని వ్యూహాలతో మైదానంలోకి దిగినా..ఓటమే ఎదరవుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. రానున్న మ్యాచ్‌లు నామమాత్రం కానున్నాయి. కోల్‌కతా జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోవడంతో ఉన్న ఆశలు సైతం ఆవిరైయ్యాయి. కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమవడం ముంబైకి శాపంగా మారాయి. 


సీజన్ ఆరంభంలో రెండు మ్యాచ్‌లకు దూరమైన ఆ జట్టు స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌..తాజాగా సీజన్ మొత్తానికి దూరమైయ్యాడు. దీంతో ఆ జట్టుకు షాక్‌ తగిలినట్లు అయ్యింది. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ముంబై భావిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 303 పరుగులతో అలరించాడు. సూర్యకుమార్‌ యాదవ్ స్టైక్ రేట్‌ 43.29గా ఉంది. 


గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడు. సూర్యకుమార్ యాదవ్‌ చేతికి గాయమైంది. దీంతో ఈటోర్నీ మొత్తానికి దూరమవుతున్నాడని నిర్వాహకులు తెలిపారు. బీసీసీఐ వైద్య బృందం సైతం అతడిని పరిశీలించింది. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. త్వరలో సూర్యకుమార్‌ యాదవ్‌ కోలుకుంటాడని..జాతీయ జట్టుకు సేవలందిస్తారని బీసీసీఐ అధికారులు వెల్లడించారు.
 


Also read:Sonakshi Sinha Engagement: వైరల్ ఫొటోస్.. ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో సోనాక్షి సిన్హా!


Also read:Horoscope Today May 10 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారి కోరిక నేడు నెరవేరనుంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook