Olympic Gold Medalist Neeraj Chopra turns 25 Today: నీరజ్ చోప్రా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో (టోక్యో ఒలింపిక్స్ 2020) భారతదేశానికి బంగారు పతకం సాధించిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన రెండవ భారతీయుడిగా కూడా నీరజ్ చోప్రా నిలిచాడు. ప్రపంచ వేదికపై భారతదేశం గర్వపడేలా చేసిన నీరజ్.. ప్రస్తుతం యువతకు ఓ రోల్ మోడల్. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నీరజ్.. నేడు 25వ పడిలోకి (Happy Birthday Neeraj Chopra) అడుగుపెట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీరజ్ చోప్రాది హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లా ఖాంద్రా గ్రామం. 1997 డిసెంబరు 24న సతీష్ కుమార్ చోప్రా, సరోజ్ బాలాదేవి దంపతులకు జన్మించాడు. నీరజ్ చండీగఢ్ డీఏవీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చిన్నప్పటినుంచి బాగా చదివే నీరజ్.. 2016లో ఆర్మీలో జూనియర్ కమీషన్ట్ ఆఫీసర్‌, సుబేదార్ ర్యాంకుతో చేరాడు. అయితే చోప్రాకు చిన్నప్పటి నుంచి ఆహారంపై అమితమైన ప్రేమ కాబట్టి ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువగా పెరిగిపోయాడు. దీంతో బరువును తగ్గించుకోవాడనికి జాగింగ్ కోసం శివాజీ స్టేడియంకు వెళ్లేవాడు. అక్కడే జావెలిన్ త్రోను తొలిసారి చూశాడు.


సరదాగా పట్టిన జావెలిన్ త్రో నీరజ్ చోప్రాకు బాగా నచ్చింది. దాంతో శివాజీ స్టేడియంలో రోజు ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాడు. రోజురోజుకు ఆ ఆటను చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. ఎంతలా అంటే జావెలిన్ త్రో అతడి జీవితంలో ఓ భాగం అయింది. 2013లో ఉక్రెయిన్‌లో జరిగిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న నీరజ్ ఉత్తచేతులతో వచ్చాడు. 2014లో బ్యాంకాక్‌లో జరిగిన జూనియర్ ఒలింపిక్స్ క్వాలిఫయర్‌లో మాత్రం రజతం సాధించాడు. ఇక టోక్యో ఒలింపిక్స్ 2020లో పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌లో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దాంతో ఒక్కసారిగా హీరో అయ్యాడు. 


# పోలాండ్‌లో జరిగిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా ఈటెను 86.48 మీటర్లు విసిరి వార్తల్లో నిలిచాడు. లాట్వియాకు చెందిన జిగిస్మండ్స్ సిర్మైస్ పేరిట ఉన్న 84.69 మీటర్ల అత్యుత్తమ రికార్డును అధిగమించాడు. 


# 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించి భారతదేశ మొదటి పురుష ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నీరజ్ చోప్రా నిలిచాడు. అతను ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రెండవ స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నీరజ్ కంటే ముందు లాంగ్ జంప్ ఈవెంట్‌లో అంజు బాబీ జార్జ్ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించారు.


# టోక్యో ఒలింపిక్స్ 2020లో నీరజ్ చోప్రా 87.58 మీటర్ల ఐకానిక్ త్రోతో స్వర్ణం గెలుచుకున్నాడు. దాంతో క్రికెట్‌ రాజ్యమేలుతున్న భారత దేశంలో హీరో అయ్యాడు.'


# నీరజ్ చోప్రా 2022 వరల్డ్ అథ్లెటిక్స్ రజతంతో పాటు డైమండ్ లీగ్‌లో రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 


# నీరజ్ గత ఏడాది తన జాతీయ రికార్డును రెండుసార్లు బద్దలు కొట్టాడు. స్టాక్‌హోల్డ్ డైమండ్ లీగ్‌లో విసిరిన 89.94 మీటర్ల దూరంతో పురుషుల విభాగంలో జావెలిన్ రికార్డును కలిగి ఉన్నాడు. ఇక  90 మీటర్ల మార్కును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.


Also Read: తొలి ముస్లిం ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా.. నాలుగేళ్ల తర్వాత!


Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.