Sania Mirza Muslim Fighter Pilot: తొలి ముస్లిం ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా.. నాలుగేళ్ల తర్వాత!

UP Girl Sania Mirza clears NDA, Set to be Indias first Muslim fighter pilot. సానియా మీర్జా ఎన్డీఏ పరీక్షల్లో 149వ ర్యాంకు సాధించారు. దాంతో సానియా భారతదేశ తొలి ముస్లిం ఫైటర్ పైలట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 24, 2022, 07:18 AM IST
  • ఎన్డీఏ పరీక్షల్లో 149వ ర్యాంకు
  • ఫైటర్ పైలట్ స్ట్రీమ్‌ను ఎంచుకున్న సానియా
  • తొలి ముస్లిం ఫైటర్ పైలట్‌గా సానియా
Sania Mirza Muslim Fighter Pilot: తొలి ముస్లిం ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా.. నాలుగేళ్ల తర్వాత!

UP Girl Sania Mirza set to be Indias first Muslim fighter pilot after clears NDA: సానియా మీర్జా.. ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పరీక్షలో ఆమె ఉత్తీర్ణత సాధించడమే. మీరు చూస్తుంది నిజమే.. సానియా ఎన్డీఏ పరీక్షల్లో 149వ ర్యాంకు సాధించారు. అయితే ఈమె భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాత్రం కాదు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన ఓ టీవీ మెకానిక్ కుమార్తె ఈ సానియా మీర్జా. ఎన్డీఏలో ఉత్తీర్ణత సాధించడంతో సానియా భారతదేశ తొలి ముస్లిం ఫైటర్ పైలట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏలో ఫైటర్ పైలట్ స్ట్రీమ్‌ను సానియా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) ఫైటర్ పైలట్‌గా మారాడానికి ఏ అభ్యర్థికి అయినా నాలుగేళ్ల సమయం పడుతుంది. ఈ నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఫైటర్ పైలట్‌గా మారడానికి ఓ అభ్యర్థి ప్లయింగ్ బ్రాంచ్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుందని ఐఏఎఫ్ పేర్కొంది. ప్లయింగ్ బ్రాంచ్‌లో ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్‌గా ఎన్డీఏలో చేరే ఏ అభ్యర్థి అయినా.. ఇతర రెండు సర్వీస్‌లలోని అతని/ఆమె కోర్స్‌మేట్స్‌తో కలిసి 3 సంవత్సరాల కంబైన్డ్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ శిక్షణ సాధారణంగా ఉంటుంది. 

భారత వైమానిక దళంలో పైలట్‌గా మారాడానికి సానియా మీర్జా చాలా కోర్సులను పూర్తి చేయాల్సి ఉంది. ఈ లెక్కన భారతదేశ తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్ అని పేరుతెచ్చుకునేందకు సానియాకు నాలుగేళ్ల సమయం పడుతుంది. ఇక ఫైటర్ పైలర్ కావాలనుకుంటున్న సానిమాకు ఐఏఎఫ్ శుభాకాంక్షలు తెలియజేసింది. ఆమె కలలన్నీ నిజమవాలని కోరుకుంది. సోషల్ మీడియాలో సానియా మీర్జాకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వస్తున్నాయి. 

హిందీ మీడియం విద్యార్థులు కూడా ధృడ సంకల్పం ఉంటే విజయం సాధించవచ్చని సానియా మీర్జా పేర్కొన్నారు. 'నేను ఎన్డీఏలో 149వ ర్యాంక్ సాధించి ఎయిర్‌ఫోర్స్‌కి ఎంపికయ్యాను. యూట్యూబ్‌లో మొదటి మహిళా పైలట్ అయిన అవనీ చతుర్వేదిని చూసి నేను ప్రేరణ పొందాను. రెండవ ప్రయత్నంలో ఈ రాంక్ సాదించా. చాలా సంతోషంగా ఉంది' అని సానియా మీర్జా తెలిపారు. యూపీలోని మీర్జాపూర్ దేహత్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జసోవర్ గ్రామ నివాసి సానియా. 

Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?  

Also Read: ఈ 17 రకాల డీజిల్ కార్లు నిలిపివేస్తున్నారు..కొనాలంటే ఇప్పుడే కోనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News