IPL 2020: ఐపిఎల్ 2020 నిర్వహణపై స్పందించిన న్యూజిలాండ్
IPL 2020 updates: ఐపిఎల్ 2020 టోర్నమెంట్‌ను న్యూజీలాండ్‌లో నిర్వహించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు ముందుకొచ్చిందని బీసీసీఐ ( BCCI ) చెబుతున్నప్పటికీ.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ( NZC ) మాత్రం అందుకు విరుద్ధమైన ప్రకటన విడుదల చేసింది.
IPL 2020 updates: ఐపిఎల్ 2020 టోర్నమెంట్‌ను న్యూజీలాండ్‌లో నిర్వహించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు ముందుకొచ్చిందని బీసీసీఐ ( BCCI ) చెబుతున్నప్పటికీ.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ( NZC ) మాత్రం అందుకు విరుద్ధమైన ప్రకటన విడుదల చేసింది. ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2020కి ( IPL 2020 ) ఆతిధ్యమిచ్చేందుకు న్యూజిలాండ్ క్రికెట్ ముందుకొచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి రిచర్డ్ బూక్ ( Richard Boock ) ప్రకటించారు. న్యూజిలాండ్‌లో ఐపిఎల్ నిర్వహించేందుకు తాము ఆసక్తి కనబర్చలేదు సరికదా.. తమవైపు నుంచి అసలు అటువంటి ప్రయత్నం ఏదీ జరగనేలేదని రిచర్డ్ బూక్ స్పష్టంచేశాడు. రేడియో న్యూజీలాండ్‌తో మాట్లాడుతూ బూక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ( Asia Cup 2020: ఆసియా కప్ రద్దు: గంగూలీ )
కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా ఈ ఏడాది మార్చి నెలలోనే జరగాల్సి ఉన్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ ( IPL ) నిరవధిక వాయిదా పడుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఐపిఎల్‌ను భారత్‌లో కాకుండా బయటి దేశాల్లో నిర్వహించేందుకు సిద్ధమైతే.. అందుకు ఆసక్తి చూపిస్తున్న దేశాల్లో యూఏఈ, శ్రీలంకతో ( UAE, Sri lanka ) పాటు న్యూజీలాండ్ ( New Zealand ) కూడా వచ్చి చేరిందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పిన అనంతరం న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు నుంచి ఈ స్పందన రావడం గమనార్హం. ( Bio-bubble: బయోబబుల్ అంటే ఏంటి? ఆటగాళ్లు పూర్తిగా సురక్షితమా ? )
ఇప్పటివరకు రెండు సందర్భాల్లో మాత్రమే ఐపిఎల్ టోర్నమెంట్‌ను భారత్‌లో కాకుండా బయటిదేశాల్లో నిర్వహించారు. అందులో ఒకటి ఐపిఎల్ 2009 ( IPL 2009 ) సీజన్ కాగా మరొకటి ఐపిఎల్ 2014 ( IPL 2014 ). 2009లో సౌతాఫ్రికాలో ( South Africa ) ఐపిఎల్ నిర్వహించగా 2014లో యూఏఈలో ఐపిఎల్ టోర్నమెంట్ జరిగింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..