Novak Djokovic: ఆస్ట్రేలియా ఓపెన్ 2021 మెన్స్ సింగిల్స్ విజేత నొవాక్ జకోవిచ్
Novak Djokovic Beats Daniil Medvedev To Clinch Australian Open 2021 Mens Singles Title: ఆదివారం నాడు జరిగిన తుది పోరులో 7-5, 6-2, 6-2 తేడాతో మెడ్వెదేవ్‌పై అలవోకగా విజయాన్ని అందుకున్నాడు.
Novak Djokovic Beats Daniil Medvedev To Clinch Australian Open 2021 : సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి సెట్ ఏకపక్షంగా సాగిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో రష్యాకు చెందిన స్టార్ ఆటగాడు డానిల్ మెడ్వెదెవ్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు.
ఆదివారం నాడు జరిగిన తుది పోరులో నొవాక్ జకోవిచ్(Novak Djokovic) 7-5, 6-2, 6-2 తేడాతో మెడ్వెదేవ్‌పై అలవోకగా విజయాన్ని అందుకున్నాడు. తద్వారా 9వ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నొవాక్ జకోవిచ్ వశమైంది. తాజాగా నెగ్గిన ఆస్ట్రేలియా స్లామ్‌తో కలిపి కెరీర్‌లో ఓవరాల్‌గా 18 గ్రాండ్ స్లామ్‌లను సెర్బియా యోధుడు నెగ్గినట్లయింది.
Also Read: IPL 2021 Auction Latest Updates: ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే
స్విట్జర్లాండ్ మాస్టర్ రోజర్ ఫెదరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్(Rafale Nadal) కన్నా కేవలం 2 గ్రాండ్ స్లామ్‌ల దూరంలో నిలిచాడు జకోవిచ్. అయితే తొలి సెట్‌లో శక్తివంచన లేకుండా పోరాటం చేసిన మెడ్వెదేవ్ 7-5 తేడాతో సెట్ కోల్పోవడం, అందులోనూ తాను తలపడుతున్న ప్రత్యర్థి నెంబర్ వన్ అని భావించి కాస్త నిరాశకు లోనయ్యాడు. దాంతో జకోవిచ్ పని మరింత సులభం అయింది.
Also Read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021లో Sunrisers Hyderabad మొత్తం ఆటగాళ్ల జాబితా ఇదే
రెండు, మూడు సెట్‌లో చాలా త్వరగా కోల్పోయాడు. ఈ సెట్‌లలో జకోవిచ్‌కు మెడ్వెదేవ్ పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. అయితే మరోవైపు మెల్‌బోర్న్‌లో తన విజయ పతకాన్ని రికార్డు స్థాయిలో 9వ పర్యాయం ఎగురవేశాడు జకో. రఫెల్ నాదల్‌కు ఎలాగైతే ఫ్రెంచ్ ఓపెన్ కంచుకోటగా ఉందో, సెర్బియా స్టార్ జకోవిచ్‌కు ఆస్ట్రేలియా ఓపెన్ పెవరెట్ గ్రాండ్‌స్లామ్. తద్వారా మరో మేజర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
Also Read: IPL 2021: సంపాదనలో MS Dhoni అరుదైన ఘనత, ఐపీఎల్‌లో ఏకైక క్రికెటర్‌గా CSK Captain
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook