Neeraj Chopra New Car: టోక్యో ఒలింపిక్స్‌ లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి.. కోట్ల మంది భారతీయుల మన్ననలు పొందాడు జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా. దీంతో అతడి విజయానికి ఎన్నో రివార్డులతో పాటు కోట్లాది అభినందనలు లభించాయి. నీరజ్‌ విజయాన్ని చూసి గర్వపడిన వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra Neeraj Chopra) కూడా ఉన్నారు. తన ఫ్లాగ్‌ షిప్‌ ఎస్‌యూవీ ‘ఎక్స్‌యూవీ700’లో ఏకంగా ‘జావెలిన్‌ ఎడిషన్‌’ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎడిషన్‌ తొలికారు నీరజ్‌కు బహూకరిస్తామని ఆనంద్‌ పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ‘ఎక్స్‌యూవీ 700 జావెలిన్‌ గోల్డ్‌ ఎడిషన్‌’ను (Javelin Gold Edition XUV700) నీరజ్‌కు అందజేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


దీనిపై నీరజ్‌ చోప్రా ట్విటర్‌లో ఆనంద్‌ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రత్యేకమైన మార్పులతో వాహనం బహుమతిగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఆనంద్‌ జీ. దీనిపై త్వరలోనే డ్రైవ్‌కు వెళతాను’ అని ట్వీట్‌ చేశారు.  



దీనిని ఆనంద్‌ మహీంద్రా రీట్వీట్‌ చేస్తూ.. ‘‘మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు. మా ఎక్స్‌యూవీ, ఛాంపియన్స్‌ రథం మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది’’ అని పేర్కొన్నారు. పారాలింపిక్స్‌ జావెలిన్‌ త్రోలో బంగారు పతకం సాధించిన సుమిత్‌కు కూడా ఇలాంటి కారునే ఆనంద్‌ బహూకరించారు. పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు తెచ్చిన అవని సహా మిగిలిన వారికి ఈ ఎడిషన్‌ వాహనాలను అందజేయనున్నారు.


విజయానికి గుర్తుగా..


నీరజ్‌కు బహూకరించిన కారును పూర్తిగా మిడ్‌నైట్‌ బ్లాక్‌ రంగులో తీర్చిదిద్దారు. ఈ కారు బయట క్రోమ్‌ కోటింగ్‌ ఉన్న వాటిని బంగారపు భాగాలతో రీప్లేస్‌ చేశారు. మహీంద్రా లోగో కూడా ఇలానే మార్చారు. టోక్యోలో నీరజ్‌ బల్లెం విసిరిన 87.58 మీటర్ల (Neeraj Chopra Gold Medal Throw) రికార్డును స్టిక్కర్‌ రూపంలో కారు వెనుక టెయిల్‌ గేట్‌పై అమర్చారు. దీంతోపాటు ముందువైపు ఫెండర్‌ వద్ద కూడా ఇలాంటిదే ఉంచారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో కూడా నీరజ్‌ ఈ నాలుగు నంబర్లనే ఎన్నుకున్నారు. ఇక కారు లోపల సీట్లను బంగారు దారంతో కుట్టారు. ఈ స్పెషల్‌ ఎడిషన్‌ మార్పుల మొత్తాన్ని మహీంద్రా అండ్‌ మహీంద్రా చీఫ్‌ డిజైనింగ్‌ ఆఫీసర్‌ ప్రతాప్‌ బోడే దగ్గరుండి చూసుకొన్నారు.


టోక్యో ఒలింపిక్స్​లో గోల్డ్​మెడల్​ సాధించిన క్రీడాకారులకు గుర్తుగా కొత్త ఎక్స్​యూవీ 700 జావెలిన్ ఎడిషన్​ను ఆవిష్కరించారు. ప్రస్తుతం 65 వేలకు పైగా బుక్సింగ్ నమోదు కాగా, వచ్చే ఏడాది జనవరి 14కల్లా కనీసం 14 వేల కార్లను అయినా డెలివరీ చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారు ధర రూ.12.49-రూ.22.89 లక్షల(ఎక్స్-షో రూమ్) మధ్య ఉంది.


చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక జెర్సీ


[[{"fid":"214472","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా గౌరవార్థం ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక జెర్సీని (Neeraj Chopra CSK Jersey) రూపొందించింది. ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ విసిరిన దూరం 87.58 మీ.. నంబరు వచ్చేలా జెర్సీని రూపొందించి.. ఆదివారం దిల్లీలో నీరజ్ కు అందజేసింది సీఎస్కే యాజమాన్యం. దీంతో పాటు స్వర్ణ పతకం సాధించిన క్రమంలో ప్రకటించిన రివార్డు కోటి రూపాయాలను అందజేసింది.  


Also Read: National Sports Awards: నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్.. విజేతలకు నవంబరు 1న ప్రదానోత్సవం 


Also Read: IND Vs NZ Match Prediction: ఇండియా Vs న్యూజిలాండ్ మ్యాచ్.. కీలక మ్యాచ్లో గెలిచేదెవరు?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook