PAK Vs ENG Head To Head: రెండు జట్లు గ్రూప్‌ దశలో తీవ్ర ఇబ్బంది పడ్డాయి. పసికూనల చేతిలో చావుదెబ్బ తిన్నాయి. అన్ని వైపులా నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. సెమీస్‌కు చేరడం కష్టమేనని అంచనా వేశారు. అందరీ అంచనాలను తలకిందులు చేస్తూ.. అద్భుతంగా పుంజుకుని సెమీ ఫైనల్‌కు చేరాయి. ఇక సెమీస్‌లో పోరాడితే పోయేదిముంది.. అన్నట్లు చెలరేగి ఆడాయి. న్యూజిలాండ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి పాక్ ఫైనల్‌కు చేరగా.. టీమిండియాను ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఇంగ్లాండ్ తుది పోరుకు అర్హత సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్థాన్ ఫైనల్ చేరిందిలా.. 


టీమిండియాతో ఆడిన మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అద్భుతం ఇన్నింగ్స్‌ ఆడడంతో పాక్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఒక పరుగు తేడాతో ఓటమి పాలైంది. తరువాత నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఇక చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. అంతకుముందు సఫారీ టీమ్‌ను నెదర్లాండ్స్‌ చిత్తు చేయడంతో పాకిస్థాన్‌కు సెమీస్ మార్గం సుగమం అయింది. ఇక సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను సునాయసంగా ఓడించి టీ20 వరల్డ్ కప్‌లో 13 ఏళ్ల తరువాత ఫైనల్‌కు చేరుకుంది. 


ఇంగ్లాండ్ ఫైనల్ చేరిందిలా.. 


తొలి మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌పై 5 వికెట్ల తేడా విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లోనే పెద్ద షాక్ తగిలింది. పసికూన ఐర్లాండ్ చేతిలో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు పరుగులు తేడాతో ఓటమి పాలైంది. తరువాత ఆసీస్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక సెమీస్‌కు చేరడం కష్టమే అనుకున్నారు. తరువాత న్యూజిలాండ్, శ్రీలంక జట్లను ఓడించి సెమీస్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్లో భారత్‌ను అలవోకగా చిత్తుచేసి మరోసారి టైటిల్‌ పోరుకు రెడీ అయింది.


ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 28 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇంగ్లాండ్‌ 17 మ్యాచ్‌లు గెలవగా.. పాకిస్థాన్‌ కేవలం 9 మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు పాకిస్థాన్, ఇంగ్లాంండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరగనుంది.  


Also Read: MODI PAWAN MEET: ఏపీ పరిస్థితులపై ప్రధానికి పవన్ రిపోర్ట్.. వైసీపీ, బీజేపీలో హై టెన్షన్?


Also Read: T20 World Cup: రోహిత్, విరాట్ కోహ్లి గుడ్ బై.. బీసీసీఐ సంచనల నిర్ణయాలు..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook