Rohit Sharma And Virat Kohli: T20 ప్రపంచ కప్‌లో భారత్ ప్రయాణం ముగిసింది. ఎన్నో అంచనాలతో ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా రిక్త హస్తాలతో తిరిగి వచ్చేస్తోంది. సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం తరువాత అభిమానులు తీవ్ర నిరాశలో కురుకుపోయారు. గ్రూప్ దశలో అత్యధికంగా 8 పాయింట్లు సాధించిన భారత్.. సెమీస్ మ్యాచ్‌లో కనీస పోటీ కూడా ఇవ్వకుండా టోర్నీ నుంచి నిష్క్రమించడం జీర్ణించుకోలేకపోతున్నారు. భారీ హిట్టర్లు ఉన్న ఇంగ్లాండ్‌కు తక్కువ లక్ష్యాన్ని నిర్ధేశించిన బ్యాట్స్‌మెన్‌ను అనలా.. 168 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయిన బౌలర్లను నిందించాలా..? టీమిండియా ఘోర పరాజయం చెందడంపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఏడాది కాలంగా ఏం చేశారని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని సీనియర్ ఆటగాళ్లను ఈ ఫార్మాట్ నుంచి తప్పించాలని ప్రణాళిక రచిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లను క్రమంగా తొలగించాలని యోచిస్తోంది. భారత T20 జట్టులో రాబోయే రెండేళ్లలో పెద్ద మార్పులు జరుగుతాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్ గురించి కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను ప్రశ్నించగా.. మార్పుల గురించి ఇప్పుడు మాట్లాడటం చాలా తొందరవుతుందన్నాడు. ఈ ఆటగాళ్లు జట్టు కోసం బాగా కష్టపడుతున్నారని.. మార్పుల దాని గురించి ఆలోచించడానికి ఇంకా చాలా సమయం ఉందని ద్రావిడ్ సమాధానం ఇచ్చాడు.
వచ్చే ఏడాది 50 ఓవర్ల ప్రపంచకప్ భారత్‌లోనే జరగనుంది. అంతకుముందు భారత్ కనీసం 25 వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది పాటు టీ20 ఫార్మాట్‌పై పెద్దగా దృష్టి సారించే అవకాశం లేదు. వచ్చే వరల్డ్ కప్ వరకు దైపాక్షిక సిరీస్‌లో 12 టీ20ల్లో మ్యాచ్‌లు ఆడబోతుంది.
ఇక రోహిత్, కోహ్లి వంటి సీనియర్ ప్లేయర్లకు టీ20 భవిష్యత్‌పై నిర్ణయించుకోవాలని బీసీసీఐ కోరే అవకాశం కనిపిస్తోంది. రోహిత్‌కి ప్రస్తుతం 35 ఏళ్లు. రెండేళ్లలో 37 ఏళ్ల వయస్సుకు చేరుకుంటాడు. అప్పటికి రాబోయే T20 వరల్డ్ కప్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లేదు. ప్రస్తుత T20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని దినేష్ కార్తీక్‌ను ఫినిషర్‌గా తీసుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్ విషయానికొస్తే.. టోర్నీ మొత్తం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడంలో విఫలమయ్యాడు. వచ్చే టీ20 సిరీస్‌లో వీరిద్దరిని బీసీసీఐ పక్కనబెట్టింది. ఈ నేపథ్యంలోనే టీ20లకు ఇక సీనియర్లను పక్కన పెట్టే దిశంగా బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్... 23 ఏళ్లకే చట్టసభకు ఎన్నికైన నబీలా సయ్యద్..
Also Read: Yashoda Twitter Review : యశోద ట్విట్టర్ రివ్యూ.. దుమ్ములేపిన సమంత.. కష్టానికి తగ్గ ప్రతిఫలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook