పాక్ క్రికెట్‌లో కరోనా కలకలం.. ఓపెనర్‌కు కరోనా పాజిటివ్
పాకిస్థాన్ క్రికెట్‌లో కరోనా వైరస్ కలకలం రేపింది. పాక్ సీనియర్ క్రికెటర్ కరోనా బారిన పడ్డాడు. కరోనా లక్షణాలతో శనివారం కరోనా పరీక్షలకు వెళ్లాడు. టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు నిర్ధారించారు.
Taufeeq Umar Tested coronavirus Positive: పాకిస్థాన్ క్రికెట్‌లో కరోనా వైరస్ కలకలం రేపింది. పాక్ సీనియర్ క్రికెటర్ తౌఫిక్ ఉమర్ కరోనా బారిన పడ్డాడు. కరోనా లక్షణాలతో ఉన్న తౌఫిక్ ఉమర్ శనివారం కరోనా పరీక్షలకు వెళ్లాడు. టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు నిర్ధారించారు. బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి
‘నిన్న రాత్రి కాస్త అనారోగ్యంగా అనిపించింది. దీంతో కరోనా టెస్టులు చేపించుకున్న. అయితే కరోనా పాజిటవ్‌గా తేలింది. మరీ అంత ప్రమాదమేమీ లైదని డాక్టర్లు చెప్పారు. నేను సొంతంగానే ఐసోలేషన్‌లో ఉన్నాను. మీరు కూడా అనుమానం వస్తే ఐసోలేషన్‌లో ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని’ పాకిస్థాన్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సూచించాడు. భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ ఇకలేరు
కాగా, పాక్ జాతీయ జట్టుకు 44 టెస్టులు, 22 వన్డేల్లో తౌఫిక్ ఉమర్ ప్రాతినిధ్యం వహించాడు. ఓపెనర్‌గా పాక్ జట్టుకు సేవలందించాడు. చాలా కాలం కింటే జట్టుకు దూరమైన ఓపెనర్ తౌఫిక్ ఉమర్.. 2014లో న్యూజిలాండ్‌తో చివరగా టెస్టు మ్యాచ్ ఆడాడు. రిటైర్మెంట్ ప్రకటించలేదు, కానీ ఆటకు మాత్రం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. (Image Credits: Twitter/@ICC) మల్టీ టాలెంటెడ్ భానుశ్రీ లవ్లీ ఫొటోషూట్