India Vs England Semifinal: కివీస్‌తో జరిగిన సెమీస్‌ పోరులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో పాకిస్థాన్ అదరగొట్టింది. మొదట బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి.. తరువాత లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. కెప్టెన్ బాబర్ అజామ్‌తో పాటు ఓపెనర్ మహ్మాద్ రిజ్వాన్ చెలరేగి ఆడడంతో పాకిస్థాన్ విజయం సులభమైంది. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో పాకిస్థాన్ అభిమానులు.. ఇంగ్లాండ్‌తో జరిగే సెమీస్‌ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకోవాలని కోరుకుంటున్నారు. ఓ పాకిస్థానీ అభిమాని వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్థాన్ జట్టు ఫైనల్ చేరిన వెంటనే పాక్‌కు చెందిన యువతి ఇంగ్లాండ్‌పై టీమిండియా గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఫైనల్‌లో పోరులో పాక్-ఇండియా తలపడాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అక్కడ భారత్‌ను తమ జట్టు ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. బౌలింగ్‌లో మీకు ఎవరు ఇష్టం అని ప్రశ్నించగా.. నసీమ్ షా పేరు చెప్పింది. టీమ్‌లో అందరూ ప్రత్యేకమే ఎవరినీ ఎవరితో పోల్చలేమంది. 


గ్రూప్‌ దశలో టీమిండియా, జింబాబ్వే చేతిలో వరుస ఓటముల తరువాత పాకిస్థాన్ సెమీస్‌కు చేరుకోవడం కష్టమేనని అందరూ అన్నారు. దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ షాక్ ఇవ్వడంతో పాక్‌కు మార్గం సుగమం అయింది. అప్పటికే సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లను ఓడించిన పాకిస్థాన్.. చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకుంది. న్యూజిలాండ్‌తో పోరులో అసలైన ఆటతీరును ప్రదర్శించింది. ఏడు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది.


నేడు ఇంగ్లాండ్‌తో భారత్ రెండో సెమీ ఫైనల్లో తలపడనుంది. గ్రూప్ దశలో నాలుగు విజయాలు సాధించిన టీమిండియా.. సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఇంగ్లాండ్‌ను ఓడించి భారత్ ఫైనల్ చేరుకోవాలని క్రికెట్ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. ఫైనల్లో పాకిస్థాన్‌తో టీమిండియా తలపడితే ఆ కిక్కే వేరు. 2007లో పాకిస్థాన్-భారత్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ అభిమానులను ఊర్రూతలూగించింది. మరోసారి అలాంటి పోరు జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 


Also Read: IND vs ENG: ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌.. భారత జట్టులో రెండు కీలక మార్పులు! స్టార్ ప్లేయర్ ఖేల్ ఖతం   


Also Read: Samantha Tension: మరో క్యాంపులో మంటలు పెట్టేసిన సమంత.. ఆ ప్రకటన వెనుక పరమార్ధం అదేనా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook