Ravichandran Ashwin Ready To Shave Half His Moustache If Pujara Does This: వికెట్లు పడకుండా అడ్డుగోడగా నిలిచే ఆటగాడు టీమిండియా క్రికెటర్ చటేశ్వర్ పుజారా. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా టూర్‌లో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకోవడంలో పూజారాది కీలకపాత్ర. ఆసీస్ పేసర్లు తనను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేసినా ఓపికగా నిలబడి జట్టును ఆదుకున్నాడు పుజారా. అలాంటి ఆటగాడిపై మరో భారత క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తన యూట్యూబ్ ఛానల్‌లో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌‌తో స్టార్ స్పిన్నర్ అశ్విన్ పలు విషయాలు చర్చించాడు. స్పిన్నర్ బౌలింగ్‌లో పుజారాను క్రీజు వదిలి బయటకు వచ్చి సిక్స్ కొట్టమని తాను పలుమార్లు చెప్పినట్లు అశ్విన్ ప్రస్తావించాడు. అయితే పుజారా ఒక్కసారి కూడా అలా చేయలేదని, పైగా కారణాలు సైతం చెప్పినట్లు Ravichandran Ashwin గుర్తుచేశాడు.


Also Read: IPL 2021: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ, నాయకత్వ లక్షణాలపై Gautam Gambhir ప్రశంసలు



ఇంగ్లాండ్ సిరీస్‌లోనైనా పుజారా తన కోరిక నెరవేర్చాలని అశ్విన్ ఆశిస్తున్నాడు. స్పిన్నర్లు మొయిన్ అలీ, లేక ఎవరైనా ఇతర స్పిన్నర్ బౌలింగ్‌లో పుజారా(Cheteshwar Pujara) క్రీజు వదిలి బయటకు వచ్చి సిక్స్ కొడితే తాను సగం మీసం తీసేసుకుంటానని బహిరంగంగా సవాల్ విసిరాడు. సగం మీసం తీసేసి ఆట కూడా ఆడతానని అశ్విన్ కామెంట్ చేశాడు.


Also Read: IPL 2021: అత్యధికంగా ఆర్జించిన భారత క్రికెటర్లు వీరే



తన ఛాలెంజ్‌ను స్టార్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా స్వీకరిస్తే బావుంటుందని టీమిండియా(Team India) బ్యాటింగ్ కోచ్ రాథోడ్‌తో అన్నాడు. అయితే ఇలాంటి సవాల్‌ను పుజారా స్వీకరిస్తాడని తాను అనుకోవడం లేదన్నాడు విక్రమ్ రాథోడ్. డిఫెన్స్ ఆడుతూ నెమ్మదిగా స్కోర్ చేస్తాడని అతడిపై విమర్శలు చేస్తారని, ప్రతి కోచ్‌కు పుజారా లాంటి వాళ్లే అభిమాన క్రికెటర్ అని వ్యాఖ్యానించాడు.


Also Read: WhatsApp Privacy Policy: ప్రైవసీ పాలసీపై వివాదంలోనూ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చిన WhatsApp 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook