IND vs ENG 5th Test: అశ్విన్ మ్యాజిక్.. ధర్మశాలలో చిత్తు చిత్తుగా ఓడిన ఇంగ్లండ్..
Dharmashala Test Highlights: ధర్మశాల టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడం విశేషం.
IND vs ENG 5th Test Highlights: ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో రోహిత్ సేన ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. తన వందో టెస్టులో సీనియర్ స్పిన్నర్ అశ్విన్(Ashwin) 9 వికెట్లు తీసి స్టోక్స్ సేన నడ్డివిరిచాడు. జో రూట్(84) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, యశస్వీ జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకున్నారు.
700 వికెట్ల క్లబ్ లో అండర్సన్
ఓవర్ నైట్ స్కోరు 473/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ 30 పరుగులు, బుమ్రా 20 రన్స్ చేసి ఔటయ్యారు. కుల్దీప్ వికెట్ తీయడం ద్వారా అండర్సన్ టెస్టుల్లో 700 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ 5, అండర్సన్, హార్ట్లీ చెరో రెండు వికెట్లు తీశారు. బషీర్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది రెండోసారి. భారత జట్టులో తొలి ఐదుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడం ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఇది నాలుగోసారి మాత్రమే.
అశ్విన్ మ్యాజిక్
మరోవైపు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ను టీమిండియా బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఆది నుంచి వికెట్లు తీస్తూ పర్యాటక జట్టుపై ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా అశ్విన్ స్పిన్ ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. రూట్ అడ్డు గోడగా నిలిచినప్పటికీ అతడికి సహకారమందించే వారే కరువయ్యారు. దీంతో రూట్ చివరి వికెట్ గా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స లో 195 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ 5, బుమ్రా రెండు వికెట్లు తీశాడు. తాజా గెలుపుతో టీమిండియా 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
Also Read: Shami Political Entry: క్రికెటర్ షమీని అస్త్రంగా బీజేపీ బెంగాల్ రాజకీయం
Also Read: Yashasvi Jaiswal: మళ్లీ బ్లాస్ట్ అయిన జైస్వాల్.. దిగ్గజాల రికార్డులు గల్లంతు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook