Rohit Sharma Cutout in Hyderabad: టీమిండియా కెప్టెన్, వన్డే క్రికెట్‌లో ఎవరికీ సాధ్యంకానీ రీతిలో మూడు డబుల్ సెంచరీలు బాదిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బర్త్ డే నేడు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్.. ముంబై జట్టుకు ఐదు టైటిళ్లు అందించి ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఓపెనర్‌గా టీమిండియాకు ఒంటి చెత్తో ఎన్నో మరుపురాని విజయాలు అందించిన హిట్‌మ్యాన్.. ఒక వన్డే వరల్డ్‌ కప్‌లో ఐదు శతకాలు బాదిన ప్లేయర్‌గా రికార్డు కూడా సృష్టించాడు. అంతేకాదు టీ20 క్రికెట్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్‌గా కూడా నిలిచాడు. ఆదివారం రోహిత్ శర్మ బర్త్ డే. ఈ సందర్బంగా క్రికెట్ అభిమానులు, సెలబ్రిటీలు హిట్‌మ్యాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1987 ఏప్రిల్ 30న రోహిత్ శర్మ జన్మించాడు. నేడు 36వ పడిలోకి అడుగుపెట్టాడు. ముంబై ఇండియన్స్ అభిమానులతోపాటు టీమిండియా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ భారీ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. హిట్‌మ్యాన్‌కు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా అభిమానులు ఉన్నారు. హైదరాబాద్‌లో రోహిత్ శర్మ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఎస్‌ఆర్‌హెచ్‌పై ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ ఆడేందుకు వచ్చినప్పుడు ఉప్పల్ స్టేడియంలో రోహిత్ శర్మ పేరు మార్మోగిపోయింది. 


నిజానికి రోహిత్ శర్మకు మంచి పేరు తీసుకువచ్చింది హైదరాబాద్ జట్టే. ఐపీఎల్ ప్రారంభంలో రోహిత్ శర్మ 2008 నుంచి 2010 వరకు డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2009లో హైదరాబాద్ టైటిల్ గెలవడంతో కీ రోల్ ప్లే చేశాడు. ఆ తరువాత రోహిత్ శర్మ 2011లో ముంబయి ఇండియన్స్‌ జట్టులో చేరినా హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఆ అభిమానం తగ్గలేదు. నేడు రోహిత్ శర్మ బర్త్ డే కావడంతో హైదరాబాద్ అభిమానులు కూడా భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.


హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ ఎదురుగా 60 అడుగుల రోహిత్ శర్మ కటౌట్‌ను ఏర్పాటు చేశారు అభిమానులు. నేడు హిట్‌మ్యాన్ 36వ బర్త్‌డే సందర్భంగా ఆవిష్కరించనున్నారు. 2019 ప్రపంచ కప్‌లో పాక్‌పై సెంచరీ చేసిన హిట్‌మ్యాన్ పోజుతో కటౌట్‌ను రెడీ చేయించారు. ముంబై ఇండియన్స్ ఈ ఫొటోలను ట్వీట్ చేసింది. 2022లో విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా 50 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 10 అడుగులు పెంచి రోహిత్ శర్మ కటౌట్ రూపొందించడం విశేషం. 


 




రోహిత్ శర్మ బర్త్ డే సందర్భంగా బీసీసీఐ కూడా ట్వీట్ చేసింది. 440 మ్యాచ్‌లు, 17057 పరుగులు, 43 సెంచరీలు, వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ అంటూ రాసుకొచ్చింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. 


 




ఇక రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా త్వరలో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది. చాలా రోజులు ఐసీసీ ట్రోఫీని భారత జట్టు గెలవలేదు. టెస్ట్ ఛాంపియన్‌ షిప్ ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి.. టీమిండియాకు కప్ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఐపీఎల్‌లో రోహిత్ శర్మ పెద్దగా ఫామ్‌లో లేడు. ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా ఆకట్టుకోలేదు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. నాలుగింటింలో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు గతేడాది గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈసారి మరోసారి ట్రోఫీని గెలవాలని రోహిత్ సేన భావిస్తోంది. నేడు ముంబై ఇండయిన్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. బర్త్ డే బాయ్ రోహిత్ శర్మ ఎలా ఆడతాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Also Read:  SEBI on Hindenburg: హిండెన్‌బర్గ్ వ్యవహారంలో కీలక పరిణామం, ఉప లావాదేవీలపై సెబీ ఏమంది


Also Read: Punjab Gas Leak: ఘోర విషాదం.. పంజాబ్‌లో గ్యాస్‌ లీక్‌.. 9 మంది మృతి  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook