Punjab Gas Leak Latest UPdates: పంజాబ్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. లూథియానాలోని గ్యాస్‌పురా ప్రాంతంలో ఆదివారం ఉదయం గ్యాస్ లీక్ కావడంతో 9 మంది మృతి చెందగా.. 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సాయంతో అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతమంతా తమ అధీనంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లీక్ అయిన విషయ వాయువు ఏంటిని ఆరా తీస్తున్నారు. ఎక్కడి నుంచి లీక్ అయింది..? ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిందా..? లేదా మురుగునీటి నుంచి లీక్ అయిందా అని ఇంకా క్లారిటీ రాలేదు.
స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇది గ్యాస్ లీక్ కావడంతోనే జరిగిన దుర్ఘటన అని లూథియానా వెస్ట్ అధికారులు చెబుతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టిందని వెల్లడించారు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. 11 మంది అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ఏడీసీపీ సమీర్ వర్మ సంఘటనా స్థలానికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షించారు. స్పృహతప్పి పడిపోయిన వారిని ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంటున్నామని చెప్పారు.
#WATCH पंजाब: लुधियाना के ग्यासपुरा इलाके में गैस रिसाव की घटना सामने आई है। मौके पर NDRF की टीम पहुंच गई है और बचाव अभियान जारी है। pic.twitter.com/ILjXIO3KOY
— ANI_HindiNews (@AHindinews) April 30, 2023
గ్యాస్‌పురాలో జరిగిన ఘోర విషాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. లూథియానాలోని గ్యాస్‌పురా ప్రాంతంలోని ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన చాలా బాధాకరమన్నారు. పోలీసులు, ప్రభుత్వ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని చెప్పారు. అన్ని విధాలా సాయం చేస్తున్నారని తెలిపారు. బాధితులను ఆదుకుంటామని ఆయన ట్వీట్ చేశారు.
Punjab CM Bhagwant Mann expresses grief over the incident of gas leak in Ludhiana.
"Police, Administration and NDRF teams are present at the spot. All possible help is being extended to the affected," says the CM
(File photo) pic.twitter.com/Rs7UnuNZV8
— ANI (@ANI) April 30, 2023
గోయల్ మిల్క్ ప్లాంట్ పేరుతో ఉన్న ఈ ఫ్యాక్టరీలో పాల ఉత్పత్తులు సరఫరా అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వాటిని చల్లబరచడానికి ఉపయోగించే గ్యాస్ లీకైందని అంటున్నారు. గ్యాస్ లీక్ అయిన 300 మీటర్ల ప్రాంతంలో ఎవరు వెళ్లినా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ గ్యాస్ లీక్ కారణంగా ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లడం లేదన్నారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రజలు భయపడుతున్నారు.
Also Read: Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?
Also Read: SEBI on Hindenburg: హిండెన్‌బర్గ్ వ్యవహారంలో కీలక పరిణామం, ఉప లావాదేవీలపై సెబీ ఏమంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి