2014లో అంతర్జాతీయ క్రికెటర్ సీన్ అబాట్ క్రికెట్‌ మైదానంలో వేసిన బంతి తలకు తగిలి స్టేడియంలోనే ప్రాణాలు విడిచాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ ఫిలిప్ హ్యూస్‌.ఈ రోజు కూడా దాదాపు అలాంటి అపశ్రుతే మైదానంలో చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూసౌత్‌ వేల్స్‌ తరఫున ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్... విక్టోరియా బ్యాట్స్‌మన్‌ విల్‌ పుకోవ్‌స్కీకి షార్ట్‌ పిచ్‌లో బంతి విసరగా.. అది తన గట్టిగా హెల్మెట్‌ను తాకి ముఖానికి గుద్దుకోవడంతో కాసేపు విల్లవిల్లాడాడు బ్యాట్స్‌మన్. ఆ బ్యాట్స్‌మన్ తిరిగి కోలుకొనేవరకు మైదానంలో చాలా అసహనంగా తిరిగాడు అబాట్. చాలా బాధపడ్డాడు కూడా.


అయితే బ్యాట్స్‌మన్‌కు ఏమీ కాలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆస్ట్రేలియా దేశావాళీ క్రికెట్‌ టోర్నీ షెఫీల్డ్‌ షీల్డ్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది.గతంలో కూడా హ్యూస్‌ మరణించాక.. మానసికంగా చాలా రోజులు కుంగిపోయాడు అబాట్.  అతను మామూలు మనిషి కావడానికి అనేక రోజులు పట్టింది.