Shane Watson's retirement from cricket: షేన్ వాట్సన్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పనున్నాడా అంటే అవుననే తెలుస్తోంది. 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) తరపున ఐపిఎల్‌లో ఆడుతున్న ఈ ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ నాలుగేళ్ల క్రితమే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు. తాజాగా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్స్ నుంచి వైదొలగనున్నట్టు చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai super Kings ) ఆటగాళ్లకు చెప్పినట్టు తెలుస్తోంది. షేన్ వాట్సన్ రిటైర్మెంట్ మాట చెప్పింది నిజమే అని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వర్గాలు సైతం చెప్పినట్టు క్రికె‌బజ్ వెల్లడించింది. Also read : Reasons behind CSK defeat: చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి కారణాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2020 లో లీగ్ దశ నుంచే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు యూఏఈ నుంచి తిరిగి వెళ్లిపోయే క్రమంలో షేన్ వాట్సన్ ( Shane Watson ) తన వీడ్కోలు గురించి వారికి చెప్పి ఉద్వేగానికి గురైనట్టు సమాచారం.  


టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై ( CSK vs KXIP match ) మ్యాచ్ గెలిచిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో షేన్ వాట్సన్ తోటి ఆటగాళ్లతో తన రిటైర్మెంట్ గురించి పంచుకుని ఉద్వేగానికి లోనైనట్టు తెలుస్తోంది. ఐపిఎల్‌లో ఆడే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని షేన్ వాట్సన్ చెప్పినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. Also read : MS Dhoni about IPL 2021: వచ్చే ఏడాది ఐపిఎల్‌లో పాల్గొనడంపై స్పందించిన ధోనీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe