DC vs CSK match highlights: చెన్నైని రఫ్పాడించిన శిఖర్ ధావన్.. ఢిల్లీ విజయం
Shikhar Dhawan, Axar Patel powers DC to win over CSK: ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఐపిఎల్ ప్రియులకు అద్భుతమైన వినోదాన్ని అందించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan 101 నాటౌట్: 58 బంతుల్లో 14ఫోర్లు, సిక్స్) చెలరేగిపోయాడు.
Shikhar Dhawan, Axar Patel powers DC to win over CSK: ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఐపిఎల్ ప్రియులకు అద్భుతమైన వినోదాన్ని అందించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan 101 నాటౌట్: 58 బంతుల్లో 14ఫోర్లు, సిక్స్) చెలరేగిపోయాడు. ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారి సెంచరీ చేసిన ధావన్.. ఇన్నింగ్స్ చివరి వరకు పోరాడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ జట్టు 5 వికెట్ల తేడాతో మరొక బంతి మిగిలి ఉందనగా ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. Also read : RR v RCB: విధ్వంసకర బ్యాటింగ్ తో విజయాన్ని అందించిన డి విలియర్స్
లక్ష్య ఛేదనలో ఓపెనర్ పృధ్వీ షా తొలి ఓవర్‌లో రెండో బంతికే డకౌట్ అయ్యాడు. తోటి బ్యాట్స్‌మేన్ వచ్చిన వాళ్లు వచ్చినట్టే స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరుతున్నప్పటికీ.. మరో ఓపెనర్ ధావన్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి మరీ పరుగులు రాబట్టాడు. చివరి ఓవర్లో అక్షర్ పటేల్ (21 నాటౌట్: 5 బంతుల్లో 3 సిక్సర్లు) జట్టును విజయతీరాలకు చేర్చాడు.
Axar Patel 3 sixes off Ravindra Jadeja: అక్షర్ పటేల్ 3 సిక్సులే కీలకం :
చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 17 పరుగులు అవసరం కాగా క్రీజులో ధావన్, అక్షర్ ఉన్నారు. డ్వేన్ బ్రావోకు గాయంతో బాధపడుతుండటంతో రవీంద్ర జడేజాను ( Ravindra Jadeja ) బౌలింగ్‌కి పంపించాడు ధోని. జడేజా వేసిన ఈ చివరి ఓవర్లో అక్షర్ ఏకంగా మూడు సిక్సర్లు బాది జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అక్షర్ పటేల్ 3 సిక్సులతో ధావన్ సెంచరీ వృధాకాకుండా జట్టు విజయం సాధించింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer 23), మార్కస్ స్టాయినీస్ (24) ఫర్వాలేదనిపించారు. అజింక్య రహానే ( 8), అలెక్స్ కేరీ (4 ) పరుగులకే పెవిలియన్ చేరారు. Also read : Steve Smith about DC bowlers: ఢిల్లీ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయాం: స్టీవ్ స్మిత్
CSK score against DC: చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్..
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ శామ్ కుర్రన్ మొదటి ఓవర్‌లో తుశార్ దేశ్ పాండే వేసిన 3వ బంతికే నోర్త్జే చేతికి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్ ( Faf Du Plessis 58: 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. షేన్ వాట్సన్ (36: 28 బంతుల్లో 6 ఫోర్లు) రాణించాడు.
4వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అంబటి రాయుడు (Ambati Rayudu 45 నాటౌట్: 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు)తో స్కోర్‌ని పరుగెత్తించాడు. మహేంద్ర సింగ్ ధోనీ ( Mahendra Singh Dhoni ) 3 పరుగులకే ఔట్ అవడం మరోసారి ధోనీ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. రవీంద్ర జడేజా (33 నాటౌట్: 13 బంతుల్లో 4 సిక్సర్లు ) జట్టు స్కోర్ పెరగడానికి దోహదపడ్డాడు. కానీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ బ్యాట్స్‌మేన్ ధావన్ సెంచరీ, అక్షర్ పటేల్ మెరుపు సిక్సులతో సూపర్ కింగ్స్ ఆట నిలిచిగెలవలేకపోయింది. Also read : IPL 2020: కోల్‌కతాపై ముంబై ఘన విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe