RR v RCB: విధ్వంసకర బ్యాటింగ్ తో విజయాన్ని అందించిన డి విలియర్స్

డి విలియర్స్ బ్యాటింగ్ ను అందుకే విధ్వంసకరంగా పిలుస్తారు. సిక్సర్ల మోతతో చెలరేగి ఆడి ఓడాల్సిన మ్యాచ్ ను గెలిపించాడు. రాజస్థాన్ రాయల్స్ పై బెంగుళూరు జట్టుకు విజయాన్ని అందించాడు.

Last Updated : Oct 17, 2020, 08:08 PM IST
RR v RCB: విధ్వంసకర బ్యాటింగ్ తో విజయాన్ని అందించిన డి విలియర్స్

డి విలియర్స్ ( AB De villiers ) బ్యాటింగ్ ను అందుకే విధ్వంసకరంగా పిలుస్తారు. సిక్సర్ల మోతతో చెలరేగి ఆడి ఓడాల్సిన మ్యాచ్ ను గెలిపించాడు. రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) పై బెంగుళూరు జట్టుకు విజయాన్ని అందించాడు.

ఐపీఎల్ 2020 ( IPL 2020 ) లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ ( RR ) , రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు ( Royal Challenge Bangalore ) ( RCB ) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నిజంగా చూడదగిందే. మ్యాచ్ చూడదగింది అనేకంటే డి విలియర్స్ విధ్వంసకర బ్యాటింగ్ చూడాల్సిందేనని. 22 బంతుల్లో 55 పరుగులు సాధించి ఓడిపోయిందనుకున్న మ్యాచ్ ను గెలిపించాడు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 177 రన్స్ చేసింది. ఈ జట్టులో స్టీవ్ స్మిత్ 36 బంతుల్లో 57 పరుగులు సాధించగా..రాబిన్ ఊతప్ప 22 బంతుల్లో 41 పరుగులతో టీమ్ కు మంచి స్కోల్ అందించారు. అనంతరం 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ నాలుగో ఓవర్లోనే పించ్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఫించ్ భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ పడిక్కల్‌తో కలిసి ఇన్నింగ్స్ ‌ను ముందుకు నడిపించినా...స్కోర్ బోర్డు వేగం పూర్తిగా తగ్గిపోయింది. 

రన్ రేట్ పూర్తిగా తగ్గిపోయి ప్రధాన వికెట్లను కూడా కోల్పోయిన దశలో క్రీజ్లో వచ్చిన డి విలియర్స్ ( De Villiers ) చెలరేగిపోయాడు. క్రీజ్ లో కుదురుకోడానికి కాస్త సమయం తీసుకోవడంతో రిక్వైర్డ్ రన్ రేట్ మరింతగా పెరిగింది. 16వ ఓవర్‌లో  డి విలియర్స్ కొట్టిన సిక్స్ తో కాస్త రన్ రేట్ పెరిగింది.  అనంతరం 24 బంతుల్లో 54 పరుగులు అవసరమైన తరుణంలో… విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు డి విలియర్స్.  22 బంతుల్లో 55 పరుగులు సాధించిన నాటౌట్ గా నిలవడమే కాకుండా జట్టుకు విజయాన్ని అందించాడు. Also read: Virat Kohli Funny Video: కోహ్లీ కామెడీ డ్యాన్స్ చూస్తే మీకు నవ్వకుండా ఉండలేరు!

Trending News