క్రికెట్లో దిగ్గజాల పేరు తీసుకుంటే అందులో నేటి టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) పేరు తప్పకుండా వస్తుంది. అదే సమయంలో ఈ భారత క్రికెటర్ గురించి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ( Shoaib Akhtar ) వివాదాస్పద వ్యాఖ్యాలు చేశాడు. 9-10 సంవత్సరాల క్రితం విరాట్ కోహ్లీ అంత మంచి ఆటగాడు ఏమీ కాదు అని అన్నాడు అఖ్తర్. కానీ నేడు ప్రపంచంలోనే టాప్ క్రికెటర్ అయ్యాడు అని తెలిపారు. దీనికి కారణం భారత క్రికెట్ టీమ్ ( Team India ) సిస్టమే అని తెలిపాడు.



తన యూట్యూబ్ ( Youtube ) ఛానెల్ లో ఒక షో చేస్తున్న సమయంలో ఈ కామెంట్ చేశాడు షోయబ్.


విరాట్ కోహ్లీ గురించి తన అభిప్రాయం చెప్పే సమయంలో..." విరాట్ నేడు అత్యున్నత శిఖరానికి చేరుకున్నాడు. దీనికారణం ఎవరో తెలుసా... 2010-2011లో అతను ఎక్కడున్నాడు.. మీకు తెలిసే ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం అతను చాలా చెడిపోయిన కుర్రాడు అప్పట్లో. కానీ తరువాత సిస్టమ్ అతనికి అండగా నిలిచింది. మ్యానేజ్మెంట్ అతనిపై విశ్వాసం కొనసాగించింది. తరువాత అతను పెద్ద ప్లేయర్ అయ్యాడు. అతనిపై టీమ్ బాగా ఆధారపడి ఉంది" అని కామెంట్ చేశాడు షోయబ్.