Sourav Ganguly Health Update: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉంది. అదనంగా రెండు స్టంట్లు వేశామని అపోలో వైద్యులు ధృవీకరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ( BCCI President Sourav Ganguly ) మరోసారి గుండె సంబంధిత సమస్య ( Cardiac problem ) తో ఆసుపత్రిలో చేరారు. జనవరి మొదటి వారంలో గుండెపోటుకు గురైన గంగూలీ చికిత్స అనంతరం కోలుకున్నారు. గుండె రక్తనాళాల్లో మూడుచోట్ల పూడికలున్నట్టు అప్పట్లో వైద్యులు గుర్తించారు. సమస్య అధికంగా ఉన్నచోట యాంజియోప్లాస్టీ ద్వారా స్టంట్ అమర్చారు. ఆరోగ్యం కుదుటపడటంతో మిగిలిన స్టంట్లను వాయిదా వేశారు. 


మరోసారి గుండెలో అసౌకర్యంగా ఉండటంతో జనవరి 27న మళ్లీ ఆసుపత్రిలో చేరారు సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly ). మరోసారి యాంజియోప్లాస్టీ ( Angioplasty ) ద్వారా మిగిలిన రెండు స్టంట్లను వేశారు. సౌరవ్ గంగూలీ యాంజియోప్లాస్టీ చికిత్స విజయవంతమైందని..అవసరమైన మిగిలిన రెండు స్టంట్ల ( Two more Stunts ) ను వేశామని అపోలో ( Apollo ) వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. సౌరవ్ గంగూలీ రేపు అంటే జనవరి 29న డిశ్చార్జ్ కావచ్చని తెలుస్తోంది. మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( West Bengal cm Mamata Banerjee ) సౌరవ్ గంగూలీని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం బాగుందని..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గంగూలీ ఆపరేషన్ విజయవంతం కావడంపై వైద్యుల్ని ఆమె అభినందించారు. 


Also read: Vijay Shankar Wedding Photos: పెళ్లిపీటలు ఎక్కిన Team India క్రికెటర్ విజయ్ శంకర్


సౌరవ్ గంగూలీ క్రికెట్ కెరీర్


సౌరవ్ గంగూలీ 16 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగి.. 113 టెస్టులు, 311 వన్డేల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. గంగూలీ కెప్టెన్సీలో ఇండియా 49 టెస్టులు ఆడి 21 విజయాలు నమోదు చేసింది. 15 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. వన్డేల్లో  146 మ్యాచ్‌లు ఆడగా..76 వన్డేల్లో గెలిచింది. 65 మ్యాచ్‌లలో ఓడింది. మరో 5 వన్డేల్లో ఫలితం తేలలేదు.  2019 అక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 


Also read: Sourav Ganguly Health Condition: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన Apollo Hospitals


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook