Faf Du Plessis Announces Retirement From Test Cricket: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సుదీర్ఘ ఫార్మాట్‌(Test Cricket)కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాది వన్డేలు, టీ20 పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి సైతం తప్పుకున్నాడు. తాజాగా బుధవారం నాడు టెస్టు క్రికెట్ ఫార్మాట్‌ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటనలో తెలిపాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలగాలని ఈ సఫారీ(South Africa Cricketer) క్రికెటర్ డుప్లెసిస్ భావించాడు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన టెస్టు సిరీస్ రద్దు కావడంతో డుప్లెసిస్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే టీ20లపై ఫోకస్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నట్లు చెప్పాడు.


Also Read: Ind vs Eng 2nd Test Live Updates: భారీ విజయంతో ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న Team India


ముఖ్యంగా 2021, 2022లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ల నేపథ్యంలో పొట్టి ఫార్మాటపై ఫోకస్ చేయడానికి టెస్టులకు గుడ్ బై చెప్పినట్లు సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడించాడు. అదే సమమయంలో వన్డేల్లో సైతం కొనసాగడానికి తాను సిద్దంగా ఉన్నానని డుప్లెసిస్ ఆ ప్రకటనలో స్పష్టం చేశాడు. ఏ కన్‌ఫ్యూజన్ లేదు, పూర్తిగా ఆలోచించి టెస్టులకు వీడ్కోలు తెలిపానంటున్నాడు.


Also Read: Ravichandran Ashwin: 33 ఏళ్ల తర్వాత తొలి క్రికెటర్‌గా అశ్విన్ అరుదైన రికార్డు, Englandపై పరుగుల మోత


కాగా, డుప్లెసిస్ దక్షణాఫ్రికా తరఫున 69 టెస్టుల్లో ప్రాతనిథ్యం వహించాడు. 40.02 సగటుతో 4,163 పరుగులు సాధించాడు. 10 శతకాలు, 21 హాఫ్ సెంచరీలు డుప్లెసిస్ ఖాతాలో ఉన్నాయి. అయితే టెస్టుల్లో డబుల్ సెంచరీ కల నెరవేరకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాది స్వదేశంలో సెంచూరియన్ పార్క్ మైదానంలో శ్రీలంక జట్టుపై జరిగిన టెస్టులో 199 పరుగుల వద్ద ఔటయ్యాడు. టెస్టుల్లో ఇదే అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం.


Also Read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021 వేలంలో ఎక్కువ ధర పలికేది వీళ్లే.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook