షాకింగ్.. కరోనాతో యువ కోచ్ ఆకస్మిక మృతి
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఓవైపు వ్యాక్సిన్ లేకపోవడం, మరోవైపు విదేశీ ప్రయాణాలు కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఓ యువ కోచ్ కరోనా బారిన పడి చనిపోయాడు.
మాడ్రిడ్ : కరోనా వైరస్ (coronavirus) సోకితే వయసు పైబడిన వారే చనిపోతున్నారని ఇప్పటివరకూ వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు. కానీ ప్రాణాంతక కోవిడ్19 (COVID-19) వైరస్ సోకడంతో పుట్‌బాల్ టీమ్ యువ కోచ్ మృతి చెందాడు. దీంతో స్పెయిన్‌లో విషాదం చోటుచేసుకుంది. 21ఏళ్ల ఫ్రాన్సిస్కో గార్సియా అనే యువకుడు మలాగ క్లబ్‌కు చెందిన అథ్లెటికో పోర్టాడా అల్టా జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
ప్రపంచానికి గడ్డుకాలం కరోనా: ఎన్టీఆర్, రామ్ చరణ్
శ్వాసతీసుకోవడంలో సమస్య ఉందని యువ కోచ్ గార్సియా ఇటీవల ఆసుపత్రిలో చేరాడు. గత కొంతకాలం నుంచి ల్యుకేమియా సమస్యతోనూ బాధపడుతున్న కోచ్‌కు కోవిడ్19 టెస్టులు నిర్వహించగా పాజిటీవ్‌గా తేలింది. చికిత్స పొందుతూనే ఫ్రాన్సిస్కో గార్సియా మరణించాడు. దీంతో ఫుట్ బాల్ క్రీడలో పెను విషాదం నెలకొంది.స్పెయిన్‌లో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 345 మంది మృతి చెందారు. పాజిటీవ్ కేసుల సంఖ్య పదివేలకు చేరడం స్పెయిన్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పాతికేళ్లు కూడా లేని యువకుడు కరోనాతో చనిపోయాడన్న వార్త స్పెయిన్‌లో చర్చనీయాంశమైంది.
Photos: అదిరేటి డ్రెస్సు మీరేస్తే దడ
కాగా, కరోనా వ్యాప్తి చెందకుండా చూడటంలో భాగంగా ఇటీవల పలు మ్యాచ్‌లు రద్దయిన విషయం తెలిసిందే. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను సైతం వాయిదా వేశారు. దక్షిణాఫ్రికా, భారత్ వన్డే సిరీస్‌ను మధ్యలోనే రద్దయింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్‌లను రద్దు చేస్తూ ముందస్తు జాగ్రత్తలు పాటించారు.
నాభి అందాలతో వర్మ హీరోయిన్ రచ్చరచ్చ!
కరోనా కథనాల కోసం క్లిక్ చేయండి
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..