Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్‌కు కరోనా పాజిటివ్.. ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లేది ఇక డౌటే..?
Ravichandran Ashwin Tests Covid Positive: బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ టూర్‌కు బయలుదేరే క్రికెటర్స్ అందరికీ కోవిడ్ ఆర్టీ పీసీఆర్ టెస్టులు నిర్వహించారు. ఇందులో అశ్విన్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో అతను ఇండియాలోనే ఆగిపోవాల్సి వచ్చింది.
Ravichandran Ashwin Tests Covid Positive: టీమిండియా స్పిన్నర్, ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారినపడ్డాడు. దీంతో జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండుతో జరగనున్న టెస్టుకు అశ్విన్ అందుబాటులో ఉంటాడా ఉండడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. టీమిండియా జట్టు ఇప్పటికే ఇంగ్లాండు చేరుకుని ప్రాక్టీస్‌కు సిద్ధమవుతుండగా.. అశ్విన్ ఇంకా ఇండియాలోనే ఉన్నాడు. ప్రస్తుతం క్వారెంటైన్‌లో కోవిడ్ నుంచి కోలుకుంటున్నాడు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ టూర్‌కు బయలుదేరే క్రికెటర్స్ అందరికీ కోవిడ్ ఆర్టీ పీసీఆర్ టెస్టులు నిర్వహించారు. ఇందులో అశ్విన్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో అతను ఇండియాలోనే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో చెన్నైలోని తన నివాసంలో హోం క్వారెంటైన్‌లో ఉన్నాడు. అశ్విన్ ఇటీవల తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) నిర్వహించిన ఫస్ట్ డివిజన్ మ్యాచ్‌లలో ఆడాడు. ఈ క్రమంలోనే కరోనా బారినపడ్డాడు.
కాగా, గతేడాది ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐదో మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది జూలై 1వ తేదీకి ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేశారు. ఈ టెస్టు సిరీస్‌లో ఇండియా ఇప్పటికే 2-1తో లీడ్‌లో ఉంది. తాజా ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా ఇంగ్లాండుతో ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. టెస్టు మ్యాచ్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Also Read: Fish Rain: విచిత్రం... కాళేశ్వరంలో చేపల వర్షం... ఆశ్చర్యపోయిన స్థానికులు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook