India Vs England Semi Final: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. పాకిస్థాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లపై విజయాలు సాధించగా.. సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. మొత్తం 8 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 10న అడిలైడ్‌లో ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ టీ20 వరల్డ్ కప్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. అతడి బ్యాట్‌ నుంచి పరుగులు రావడం కష్టంగా మారింది. 
కెప్టెన్‌గా రోహిత్ శర్మ మరింత బాధ్యతతో ఆడాల్సిందిపోయి.. ప్రత్యర్థులకు సులభంగా వికెట్ సమర్పించుకుంటున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అతను 7 బంతుల్లో 4 పరుగులు చేశాడు. ఆ తరువాత నెదర్లాండ్స్‌తో 53 పరుగులతో ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. 


కానీ సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లో 15 పరుగులు, బంగ్లాదేశ్‌పై 8 బంతుల్లో 2 రన్స్, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 13 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. హిట్ మ్యాన్‌ అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నాడని.. బ్యాట్‌తో కూడా రాణించాలని అతని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రోహిత్ ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే అని అంటున్నారు.


ఇంగ్లాండ్‌తో జరిగే సెమీస్‌ పోరుకు ముందు రోహిత్ ఫామ్ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మ నాకౌట్ మ్యాచ్‌ల కోసం పరుగులు ఆదా చేస్తున్నాడని.. అవి పెద్ద మ్యాచ్‌లు కావడంతో కచ్చితంగా విజృంభిస్తాడని చెప్పాడు. ఆసీస్ పిచ్‌లపై ఫుల్‌ షాట్స్‌ ఆడటంలో రోహిత్ ఇబ్బంది పడుతున్నాడని అన్నాడు. రెండేళ్ల క్రితం కూడా టెస్టుల్లో 30 నుంచి 40 పరుగులు చేసిన తరువాత ఇలానే ఫుల్ షాట్స్ ఔట్ అయ్యేవాడని గుర్తుచేశాడు. టీ20 ఫార్మాట్‌లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్‌ను చూసుకుని ఫుల్ షాట్ ఆడాలని ఈ దిగ్గజ ఆటగాడు సూచించాడు. 


Also Read: Netherlands: పాకిస్థాన్‌కు నెదర్లాండ్స్ సెమీస్‌ గిఫ్ట్.. వెంటనే రిటర్న్ గిఫ్ట్ పంపిన పాక్  


Also Read:  Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. ఇప్పటం గ్రామంలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook