Netherlands: పాకిస్థాన్‌కు నెదర్లాండ్స్ సెమీస్‌ గిఫ్ట్.. వెంటనే రిటర్న్ గిఫ్ట్ పంపిన పాక్

Netherlands Qualify For T20 World Cup 2024: దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించడంతో పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు చేరుకుంది. తమకు సెమీస్ గిఫ్ట్ ఇచ్చిన డచ్‌కు పాక్ కూడా రిటర్న్ గిఫ్ల్ పంపించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2022, 02:46 PM IST
Netherlands: పాకిస్థాన్‌కు నెదర్లాండ్స్ సెమీస్‌ గిఫ్ట్.. వెంటనే రిటర్న్ గిఫ్ట్ పంపిన పాక్

Netherlands Qualify For T20 World Cup 2024: భారత్‌తో తొలి మ్యాచ్‌లో ఓటమి.. రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఊహించని షాక్.. పాక్ సెమీస్ చేరాలంటే దక్షిణాఫ్రికాను భారత్ ఓడించి తీరాలి. కానీ అలా జరగలేదు. తరువాత భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించాలి. ఇదీ కూడా జరగలేదు. ఇక టీ20 వరల్డ్ కప్ నుంచి వెళ్లిపోవడమే తరువాయి అనుకుంటున్న సమయంలో పసికూన నెదర్లాండ్స్ పాక్‌కు ప్రాణం పోసింది. దక్షిణాఫ్రికా జట్టుపై సంచలన విజయం సాధించి పాకిస్థాన్‌కు సెమీస్ బెర్త్ గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ ఓటమితో సఫారీ ఆటగాళ్లు మైదానంలో కంటతడి పెట్టుకుంటూ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆ తరువాత బంగ్లాదేశ్‌ను ఓడించి పాక్ సెమీస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆ దేశ ఆటగాళ్లు సంబరాలు అంబరాన్ని అంటాయి. నెదర్లాండ్స్ ఆటగాళ్లకు థ్యాంక్స్ చెబుతున్నారు.

తమకు సెమీస్ బెర్త్ గిఫ్ట్‌గా ఇచ్చిన నెదర్లాండ్స్‌కు పాకిస్థాన్ జట్టు కూడా వెంటనే రిటర్న్ గిఫ్ట్ పంపించింది. అది ఎలా అని అనుకుంటున్నారా..? సౌతాఫ్రికా-నెదర్లాండ్స్‌ మ్యాచ్ తరువాత పాకిస్థాన్-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాను పాక్ ఓడించడంతో వచ్చే T20 వరల్డ్ కప్‌కు బిగ్ టీమ్స్‌తో పాటు నేరుగా అర్హత సాధించింది. ఒకవేళ బంగ్లాదేశ్ గెలిచి ఉంటే.. ఆ జట్లు ఆరు పాయింట్లతో సెమీస్‌కు చేరుకునేది. నెదర్లాండ్స్ 2024లో జరిగే ప్రపంచ కప్‌ కోసం మళ్లీ క్వాలీఫై మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చేది. సఫారీ జట్టును ఓడించి తమకు గిఫ్ట్ పంపిన డచ్ ఆటగాళ్లకు.. బంగ్లాను ఓడించి వెంటనే రిటర్న్ గిఫ్ట్ పంపించారు పాక్ ఆటగాళ్లు. దీంతో రెండు జట్ల ఫ్యాన్స్‌ హ్యాపీ.  

గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు.. గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు సెమీస్‌కు బెర్త్‌లు కన్ఫార్మ్ చేసుకున్నాయి. మొదటి సెమీస్‌లో కివీస్-పాక్, రెండో సెమీస్‌లో ఇండియా-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. అటు న్యూజిలాండ్‌పై పాకిస్థాన్.. ఇటు ఇంగ్లాండ్‌పై ఇండియా విజయం సాధిస్తే.. 2007 తరహాలో మరోసారి వరల్డ్ కప్‌ ఫైనల్లో దయాది జట్ల మధ్య పోరును చూడొచ్చు.  

Also Read: EWS Reservation: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్డు సంచలన తీర్పు   

Also Read: రోహిత్ భాయ్.. ఒకే ఒక్క హగ్‌ అంటూ ఫ్యాన్ కన్నీటిపర్యంతం! గుండెలు పిండేసే వీడియో

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News