Suresh Raina About Greg Chappell: చిన్న వయసులోనే గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఇర్ఫాన్ పఠాన్ లాంటి కొందరు ఆటగాళ్ల కెరీర్ నాశనం చేశాడని విమర్శలు ఎదుర్కొన్న ఆసీస్ మాజీ క్రికెటర్ చాపె‌ల్ గురించి సురేష్ రైనా మాటల్లోనే...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియాకు వన్డే మ్యాచ్‌లలో భారీ లక్ష్యాలను ఛేదించడం నేర్పించిన వ్యక్తి మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అని తాను భావిస్తున్నానని మాజీ క్రికెటర్ సురేష్ రైనా చెప్పాడు. టీమిండియా (Team India) ప్రధాన కోచ్‌గా గ్రెగ్ చాపెల్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి, కానీ విజయాలు సాధించడానికి గల ప్రాముఖ్యతను ఆటగాళ్లకు వివరించిన కోచ్ చాపెల్ అని రైనా కితాబిచ్చాడు. త్వరలో విడుదల కానున్న తన ఆటోబయోగ్రఫీ ‘బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మి’ (Believe - What Life and Cricket Taught me)లో మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా పలు విషయాలు ప్రస్తావించాడు.


Also Read: WTC Final 2021: సౌతాంప్టన్‌లో Team India ప్రాక్టీస్ వీడియో షేర్ చేసిన BCCI


‘భారత జట్టుకు గెలవడం ఎలాగో తెలుసు, కానీ ఛేజింగ్ విషయానికొచ్చేసరికి తడబాటుకు లోనయ్యేది. ఈ విషయంలో గ్రెగ్ చాపెల్ సమూల మార్పులు తీసుకొచ్చాడు. చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా వరుసగా 17 వన్డేలలో విజయాలు అందుకుంది. సెప్టెంబర్ 2, 2005 నుంచి 18 మే 2006 వరకు తిరుగులేని జట్టుగా భారత్‌ను నిలిపాడు. ఛేజింగ్‌లో ధైర్యంగా నిలబడి బ్యాటింగ్ చేయడం ప్రత్యర్థి బౌలర్లను భయపెడుతుందని, అదే బ్యాట్స్‌మెన్‌కు ప్లస్ పాయింట్ అని జట్టులో ప్రేరణ నింపాడు. జట్టుకు దూకుడు నేర్పిన కోచ్‌లలో చాపెల్ ముందు వరుసలో ఉంటాడని’ తన ఆత్మకథలో సురేష్ రైనా (Suresh Raina) రాసుకొచ్చాడు.


Also Read: ICC WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్, Team Indiaలో ఆందోళన పెంచుతున్న కివీస్ రికార్డులు


చాపెల్ తొలిసారిగా ఛార్జ్ తీసుకున్న తరువాత జరిగిన శ్రీలంక సిరీస్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేష్ రైనా టీమిండియాకు అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లలో ఆకట్టుకోని సురేష్ రైనా 226 వన్డేలలో 35.31 సగటుతో 5,615 పరుగులు సాధించాడు. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings)కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook