WTC Final 2021: సౌతాంప్టన్‌లో Team India ప్రాక్టీస్ వీడియో షేర్ చేసిన BCCI

WTC Final 2021 Team India Practice: మరో 8 రోజుల్లో ప్రతిష్టాత్మక ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ఫ్రారంభం కానుందని తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య అసలుసిసలైన పోరు మొదలవుతుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 10, 2021, 03:35 PM IST
WTC Final 2021: సౌతాంప్టన్‌లో Team India ప్రాక్టీస్ వీడియో షేర్ చేసిన BCCI

WTC Final 2021: క్వారంటైన్ పూర్తి చేసుకున్న టీమిండియా ఆటగాళ్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం కసరత్తులు మొదలుపెట్టారు. మరో 8 రోజుల్లో ప్రతిష్టాత్మక ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ఫ్రారంభం కానుందని తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య అసలుసిసలైన పోరు మొదలవుతుంది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు సంబంధించి వీడియో షేర్ చేయగా వైరల్ అవుతోంది. బుధవారం నాడు సౌతాంప్టన్ లోని ఏజిస్ బౌల్ మైదానం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ నిర్వహణకు వేదికగా మారింది. బుధవారం టీమిండియా (Team India) కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, ఇతర ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసిన వీడియోను జూన్ 10న బీసీసీఐ షేర్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌తో సహా ఫీల్డింగ్ సైతం ప్రాక్టీస్ చేయడం డబ్ల్యూసీ ఫైనల్ సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. తొలి గ్రూప్ ట్రెయినింగ్ సెషన్ ప్రాక్టీస్ ఓ రేంజ్‌లో ఉందని ట్వీట్‌లో పేర్కొంది.

Also Read: Dingko Singh Passes Away: ప్రముఖ భారత బాక్సర్ డింగ్‌కో సింగ్ కన్నుమూత

టీమిండియా ఆటగాళ్లు జూన్ 3న సౌతాంప్టన్ చేరుకున్నారు. మూడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ పూర్తిచేసుకున్న అనంతరం నిర్వహించిన కోవిడ్19 టెస్టులలో ఆటగాళ్లకు నెగటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి కుటుంబసభ్యులతో పర్యటనకు వెళ్లడానికి ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి అనుమతి ఇవ్వడం తెలిసిందే. అనుష్క శర్మ కూతురు వమికాతో విరాట్ కోహ్లీ (Virat Kohli), ఇతర ఆటగాళ్లు సైతం తమ కుటుంబసభ్యులతో సౌతాంప్టన్‌‌లో ఉన్నారు. వివాహం అనంతరం పేసర్ జస్ప్రిత్ బుమ్రా తొలిసారి భారత జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు.

Also Read: ICC WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్, Team Indiaలో ఆందోళన పెంచుతున్న కివీస్ రికార్డులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News