క్రికెట్ ప్రేమికులు చేదువార్త. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ వాయిదాల మీద వాయిదాల పడుతోంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ రద్దు కానుందని తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) నిర్ణయం తీసుకుందని ఐసీసీ వర్గాలు సమాచారం. త్వరలోనే ఐసీసీ అధికారిక ప్రకటన వెలువడనుంది.   ధోనీలో కసి కనిపించలేదు: బెన్ స్టోక్స్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐసీసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ అభిప్రాయాల్ని వెల్లడించిన తర్వాత ఈ ఏడాది నిర్వహించడం వీలుకాదని తేల్చేశారు. దీంతో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ నెలలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఇతర రంగాలతో పాటు క్రికెట్ మీద కరోనా ప్రభావం చూపింది. ఈ క్రమంలో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 వాయిదా పడింది.



కరోనా నేపథ్యంలో విదేశీ క్రికెటర్లకు వీసాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో తొలుత దాదాపు రెండు వారాలపాటు ఐపీఎల్ వాయిదా వేశారు. అయితే కరోనా ప్రభావం తగ్గని కారణంగా భారత్‌లో లాక్‌డౌన్ పొడిగిస్తున్నారు. దీంతో టీ20 లీగ్ ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కావడం లేదు. ఒకవేళ కరోనా ప్రభావం తగ్గితే  సెప్టెంబర్, అక్టోబర్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఐపీఎల్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి