Virat Kohli Runs in T20Is: టీమిండియా రన్ మెషిన్‌గా పేరున్న విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌పై చెలరేగిపోయి ఇండియాకు అద్భుతమైన విజయాన్ని అందించడమే కాకుండా తన వ్యక్తిగత ఖాతాలోనూ అంతే అద్భుతమైన రికార్డును నమోదు చేసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో టీమిండియా స్కిప్పర్ రోహిత్ శర్మను వెనక్కు నెట్టేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 82 పరుగులు రాబట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం టీ20 ఇంటర్నేషనల్స్‌లో విరాట్ కోహ్లీ ఖాతాలో 3,794 పరుగులు వచ్చిచేరగా.. రోహిత్ శర్మ ఖాతాలో 3741 పరుగులు ఉన్నాయి. 



 


రెండో ఓవర్లో నసీం షా బౌలింగ్‌లో కే.ఎల్. రాహుల్ ఔట్ అవడంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మొదట చాలా నెమ్మదిగానే బ్యాటింగ్ చేశాడు. తొలి 20 బంతుల్లో కేవలం 11 పరుగులే రాబట్టిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత 33 బంతుల్లో 71 పరుగులు బాది టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ తన కెరీర్లోనే మెరుగైన ఇన్నింగ్స్‌గా విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. 



 


అయితే, రోహిత్ శర్మ మాత్రం ఇది విరాట్ కోహ్లీకే కాదు.. టీమిండియాకు కూడా బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పి కోహ్లీ ఘనతను మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. అంతేకాదు.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీని ( Virat Kohli ) మ్యాచ్ గెలిచిన వెంటనే మైదానంలోనే భుజాలపైకి ఎత్తుకుని తిప్పి తన అభిమానాన్ని చాటుకున్నాడు.


Also Read : Virat Kohli-Rohit Sharma: నువ్వే 'కింగ్'వు.. విరాట్ కోహ్లీని ఎత్తుకుని గిరగిరా తిప్పేసిన రోహిత్‌ శర్మ! వైరల్ అవుతున్న వీడియో


Also Read : Ind vs Pak: నరాలు తెగే ఉత్కంఠ, చివరి ఓవర్‌లో అసలు ఏం జరిగింది


Also Read : Ind vs Pak: హార్దిక్ పాండ్యా కొత్త రికార్డు, టీ20ల్లో వేయి పరుగులు, 50 వికెట్లు సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి