Kapil Dev Heart Attack: క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌కు హార్ట్ ఎటాక్.. సర్జరీ చేసిన వైద్యులు!
Kapil Dev, former Team India skipper, suffers heart attack | భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (61)కు గుండెపోటు (Heart Attack) వచ్చింది. ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
Kapil Dev Suffers Heart Attack: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (61)కు గుండెపోటు (Heart Attack) వచ్చింది. ఢిల్లీలోని ఓఖ్లాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌ను చేర్పించారు. యాంజియోప్లాస్టీ సర్జరీ చేసినట్లు సమాచారం. కపిల్‌దేవ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలియగానే సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు స్పందిస్తున్నారు. భారత్‌కు తొలి ప్రపంచ కప్ అందించిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
కపిల్ దేవ్ ఆరోగ్య పరిస్థితి (Kapil Dev Health Condition)పై వైద్యుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. కపిల్ దేవ్‌కు గుండెపోటు నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 1983లో భారత్‌కు వన్డే ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్. ఆయన 16 ఏళ్లపాటు భారత జాతీయ క్రికెట్ జట్టుకు సేవలు అందించారు. 131 టెస్టులు, 225 వన్డేలలో టీమిండియాకు కపిల్ దేవ్ ప్రాతినిథ్యం వహించారు. కపిల్‌కు డయాబెటిస్ లాంటి సమస్య ఉన్నట్లు సెలబ్రిటీలు పోస్ట్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe