అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహించనున్న  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఆడేందుకుగానూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసింది. కానీ అనూహ్యంగా టీమిండియా కీలక పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. యూకే వేదికగా జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ ప్రారంభం కానుందని తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం ఇంగ్లాండ్ జట్టుతో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌‌కుగానూ కీలక పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. మొత్తం 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేయగా అందులో ఆరుగురు పేసర్లున్నారు. వీరిలో ముగ్గురు జట్టులో ఉంటే మరో ముగ్గురిని స్టాండ్ బై ఆటగాళ్లుగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. కీలకమైన టెస్టు ఛాంపియన్‌షిప్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక కాలేదని టీమిండియా (Team India) పేసర్ భువీ బాధలో ఉంటే జాతీయ మీడియాలో మాత్రం భిన్నమైన కథనాలు వచ్చాయి. టెస్టులు ఆడేందుకు భువీ ఆసక్తి చూపడం లేదని, అందుచేత బీసీసీఐ అతడికి టెస్టుల్లో అవకాశాలు ఇవ్వడం లేదనే కథనాలపై మీడియం పేసర్ భువనేశ్వర్ కుమార్ ఘాటుగా స్పందించాడు.


Also Read; Team India ఆటగాళ్లకు రూ.10 వేలు జరిమానా, MS Dhoni ఆలోచనకు కారణమిదే



‘నేను టెస్టులు ఆడాలని కోరుకోవడం లేదని వార్తా కథనాలు చదివాను. దీనిపై స్పష్టత ఇస్తున్నాను. టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్లో ఆడేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. టీమ్ సెలక్షన్ పట్టించుకోకుండా మూడు ఫార్మాట్లు ఆడేందుకు సిద్ధమయ్యాను. భవిష్యత్తులోనూ అదే పని చేస్తాను. కానీ సోర్సెస్ అంటూ మీరు లేనిపోని వార్తలు రాయడం ఆపండి’ అని డబ్ల్యూటీఏ, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడానికి కారణమనే వదంతులపై పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) ఈ విధంగా స్పందిస్తూ ట్వీట్ చేశాడు.  


Also Read: IPL 2021 తదుపరి మ్యాచ్‌లకు ఇంగ్లాండ్ దూరం, స్పష్టం చేసిన ఇంగ్లాండ్ బోర్డు


ఐపీఎల్ 2020లో గాయపడ్డ భువీ అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో ఆడిన టెస్టు సిరీస్‌లకు అందుబాటులో లేడు. గాయం నుంచి కోలుకున్న అనంతరం ఈ ఏడాది ఆరంభంలో భువనేశ్వర్ కేవలం వన్డేలు, టీ20 సిరీస్‌లలో మాత్రమే టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. 2018 జనవరి 24-27 తేదీలలో జోహన్నెస్ బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం ఈ మూడేళ్ల కాలంలో మరో మ్యాచ్ ఆడిన దాఖలాలు లేవు. అదే సమయంలో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి మూడేళ్లు గడిచిపోవంతో టెస్టు ఫార్మాట్‌లో భువనేశ్వర్ సెలక్షన్, ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పేసర్ భువీని ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ టెస్టుకు ఎంపిక చేయలేదని తెలుస్తోంది.   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook