Bhuvneshwar Kumar: పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు షాకిచ్చిన BCCI సెలక్షన్ కమిటీ, WTC Finalకు భువీ దూరం

Team India Latest News | అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహిస్తున్న ఈ కిలక టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసింది. కానీ అనూహ్యంగా టీమిండియా కీలక పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.

Written by - Shankar Dukanam | Last Updated : May 12, 2021, 05:11 PM IST
Bhuvneshwar Kumar: పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు షాకిచ్చిన BCCI సెలక్షన్ కమిటీ, WTC Finalకు భువీ దూరం

Bhuvneshwar Kumar: వన్డేల్లో ఛాంపియన్స్ ట్రోఫీ తరహాలో టెస్టుల కోసం తీసుకొచ్చిన విధానం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహిస్తున్న ఈ కిలక టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసింది. కానీ అనూహ్యంగా టీమిండియా కీలక పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.

యూకే వేదికగా జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్ జట్టుతో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌ నుంచి సైతం భువనేశ్వర్ కుమార్‌ను సెలక్షన్ కమిటీ పక్కన పెట్టింది. 20 మంది ఆటగాళ్లలో ఆరుగురు పేసర్ల పేర్లు ప్రకటించగా, ముగ్గురు జట్టులో ఉంటే మరో ముగ్గురిని స్టాండ్ బై ఆటగాళ్లుగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కీలకమైన టెస్టు ఛాంపియన్‌షిప్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు Team Indiaకు భువీని ఎంపిక చేయకపోవడానికి కారణాలను ఓ అధికారి వెల్లడించారు. ఐపీఎల్ 2020లో గాయపడ్డ భువీ అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో టెస్టు సిరీస్‌లకు అందుబాటులో లేడు.

Also Read: Team India ప్లేయర్స్ కేవలం Covishield Vaccine తీసుకుంటున్నారు, కారణమేంటో తెలుసా

గాయం నుంచి కోలుకున్న అనంతరం ఈ ఏడాది ఆరంభంలో భువనేశ్వర్ కేవలం వన్డేలు, టీ20 సిరీస్‌లలో మాత్రమే టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలి కాలంలో పేసర్ భువీ(Bhuvneshwar Kumar) సుదీర్ఘంగా జరిగే టెస్టు సిరీస్‌లో ఆడలేదు. అదే సమయంలో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి మూడేళ్లు గడిచిపోవంతో టెస్టు ఫార్మాట్‌కుగానూ భువనేశ్వర్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2018 జనవరి 24-27 తేదీలలో జోహన్నెస్ బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం ఈ మూడేళ్ల కాలంలో మరో మ్యాచ్ ఆడిన దాఖలాలు లేవు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ భువనేశ్వర్‌ను ఎంపిక చేయలేదు. 

Also Read: T20 World Cup 2021 ఆడేందుకు యార్కర్ స్పెషలిస్ట్ Lasith Malinga వచ్చేస్తున్నాడు

గాయాల నుంచి కోలుకున్నప్పటికీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీలలో ప్రాతినిథ్యం వహించడంతో ఇంగ్లాండ్‌లో టీ20, వన్డే ఫార్మాట్ మ్యాచ్‌లలో మాత్రమే భువీకి అవకాశం ఇచ్చారని తెలిసిందే. ఇంగ్లాండ్ మీద 3 వన్డేలలో 4.65 ఎకానమీతో 22.5 సగటున 6 వికెట్లు పడగొట్టాడు. 5 టీ20ల సిరీస్‌లో 8.06 ఎకానమీతో 28.75 సగటున నాలుగు వికెట్లు తీశాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News