Team India white ball captain Rohit Sharma Gives Priceless Lessons To U19 Cricketers At NCA : టీమిండియా (Team India) పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయం వల్ల రోహిత్‌ శర్మ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమయ్యారు. మరి ఈ హిట్‌మ్యాన్ ఇప్పుడు ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారో తెలుసా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో ఉన్నారు. సౌత్‌ ఆఫ్రికా ప‌ర్య‌ట‌నకు ముందు గాయ‌ప‌డ్డ రోహిత్ శ‌ర్మ నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో కోలుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా (South Africa for Test series) టెస్టు సిరీస్‌ కోసం ప్రాక్టీస్ చేస్తుండ‌గా రోహిత్ ఎడ‌మ కాలు గాయం తిర‌గ‌బెట్టింది. హిట్‌మ్యాన్ ఎడ‌మ తొడ న‌రం ప‌ట్టేసింది. ఇక రోహిత్ కోలుకునేందుకు మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. రోహిత్ ఎన్‌సీఏలో ఫిజియోథెర‌పీల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు. 


అయితే మన హిట్‌మ్యాన్ అక్కడ ఉన్న కుర్రాళ్ల‌కు మెళకువలు బోధిస్తున్నారు. ఎన్‌సీఏ (NCA)లో డిసెంబర్‌‌ 23 నుంచి యూఏఈలో జ‌రిగే ఆసియా క‌ప్‌ కోసం టీమిండియా అండ‌ర్‌-19 టీమ్ (India U19 team) శిక్షణ పొందుతోంది. ఆ టీమ్‌ను రోహిత్‌ శర్మ కలిశాడు. వారితో కాసేపు ముచ్చ‌టించాడు. అంతేకాదు వారికి క్రికెట్‌కు సంబంధించిన మెళకువలు చెప్పాడు. 


Also Read : Chandrababu Comments: మాట్లాడితే మడమ తిప్పని నేత అంటారు-అమరావతిపై ఎందుకు మడమ తిప్పారు : చంద్రబాబు


ఆట‌లో స‌వాళ్లు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలనే విషయాలను టీమిండియా అండ‌ర్‌ - 19 జట్టుకు (Team India U19 Cricketers) వివరించాడు రోహిత్‌ శర్మ. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.



ఇక ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్నాడు. ముంజేతి గాయం వల్ల జడేజా కూడా సౌత్‌ఆఫ్రికా (South Africa) టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.



Also Read : flipkart Big Saving Days: కిలో టమాటాల కంటే చీప్ గా స్మార్ట్ ఫోన్స్ అమ్మకం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook