Chandrababu Comments: మాట్లాడితే మడమ తిప్పని నేత అంటారు-అమరావతిపై ఎందుకు మడమ తిప్పారు : చంద్రబాబు

Chandrababu Naidu comments on YS Jagan: అమరావతి ఏ ఒక్కరిదో కాదని... రాష్ట్ర ప్రజలందరి రాజధాని అని అన్నారు. అమరావతి మునిగిపోతుందని... అక్కడ ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని... ఇలా రకరకాల దుష్ప్రచారాలు, ఆరోపణలు చేశారని అన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీం కోర్టే చెప్పిందన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 08:31 PM IST
  • మాట్లాడితే మడమ తిప్పని నేత అంటారు-అమరావతిపై ఎందుకు మడమ తిప్పారు : చంద్రబాబు
  • తిరుపతిలో అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభ
  • అమరావతిపై సీఎం జగన్‌ను నిలదీసిన చంద్రబాబు
  • అమరావతి విషయంలో మడమ తిప్పారని విమర్శలు
Chandrababu Comments: మాట్లాడితే మడమ తిప్పని నేత అంటారు-అమరావతిపై ఎందుకు మడమ తిప్పారు : చంద్రబాబు

Chandrababu Naidu comments on YS Jagan: మాట్లాడితే మడమ తిప్పని నేత జగన్ రెడ్డి (YS Jagan) అంటారు... మరి అమరావతిపై ఎందుకు మడమ తిప్పారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అమరావతి రైతులు చేసిన పాపమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమంలో ఎస్సీల పైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన పనికిమాలిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని విమర్శించారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు.

అమరావతిలోనే (Amaravati) రాజధానిని కొనసాగించాలని పాదయాత్ర చేసిన ప్రతీ ఒక్కరినీ అభినందిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి ఉద్యమంలో 500 మందిని జైలుకు పంపించారని... 180 మంది చనిపోయారని అన్నారు. దాదాపు 2500 మందిపై కేసులు పెట్టారని ఆరోపించారు. అమరావతిపై కుల ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని... సీఎం జగన్ (CM Jagan) తన ఇష్టానుసారం ముందుకెళ్తే కుదరదని మండిపడ్డారు. జగన్‌తో సహా అన్ని పార్టీలు అమరావతిలోనే రాజధాని ఏర్పాటును స్వాగతించాయని గుర్తుచేశారు.

అమరావతి ఏ ఒక్కరిదో కాదని... రాష్ట్ర ప్రజలందరి రాజధాని అని అన్నారు. అమరావతి (Amaravati) మునిగిపోతుందని... అక్కడ ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని... ఇలా రకరకాల దుష్ప్రచారాలు, ఆరోపణలు చేశారని అన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీం కోర్టే చెప్పిందన్నారు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా ధర్మ పోరాటంలో అంతిమ విజయం మనదేనని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగం 5 కోట్ల ఆంధ్రుల కోసమేనని... వారి త్యాగానికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. అభివృద్ది అన్ని ప్రాంతాల్లో జరగాలి... కానీ రాజధాని మాత్రం అమరావతిలోనే ఉండాలని అన్నారు. అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపై ఉందన్నారు. అమరావతి భూములతోనే ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చునని... ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అమరావతిని అభివృద్ది చేయొచ్చునని అన్నారు.

Also Read: Job Mela: ఏపీలో జాబ్ మేళా-ఆ కంపెనీల్లో ఉద్యోగాలు-పూర్తి వివరాలివే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News