Ind Vs England Highlights: వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రయాణం ముగిసింది. తప్పకుండా కప్ గెలుస్తారని అందరూ అంచనా వేయగా.. సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఏకంగా పది వికెట్ల తేడాతో ఓడిపోవడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. కేవలం 16 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. భారత బౌలర్ల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుండగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా చోటు దక్కించుకున్న రిషబ్ పంత్‌కు మ్యాచ్‌ చివర్లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఒక బౌండరీ బాది దూకుడు మీదే కనిపించాడు. కానీ ఆఖరి ఓవర్లో తన వికెట్‌ను హార్ధిక్ పాండ్యా కోసం త్యాగం చేశాడు. క్రిస్ జోర్డాన్ వేసిన ఈ ఓవర్‌లో మొదటి బంతికే పంత్ సింగిల్ తీసి పాండ్యాకు స్ట్రైక్ ఇచ్చాడు. తరువాత బంతికి కూడా పాండ్యా సింగిల్ తీశాడు. మూడో బంతిని కొట్టే క్రమంలో పంత్ బాల్‌ను మిస్ చేశాడు. నేరుగా కీపర్ జోస్ బట్లర్ చేతిలోకి వెళ్లింది.


అయితే నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న హార్ధిక్ పాండ్యా రన్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు. పంత్ కాస్త ముందుకు వచ్చి మళ్లీ క్రీజ్‌లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. ఈలోపు బట్లర్ బంతిని బౌలర్ జోర్డాన్‌కు అందించాడు. హార్ధిక్ పాండ్యా ఆగకుండా స్టైకింగ్ ఎండ్‌కు వచ్చేయడంతో.. పంత్ తాను ఔట్ అవుతానని తెలిసినా.. క్రీజ్‌ వదిలి రన్‌ కోసం ప్రయత్నించాడు. ఇలా తన స్వార్థం కోసం ఆలోచించకుండా దూకుడు మీద పాండ్యా కోసం వికెట్ త్యాగం చేశాడు. 


అయితే పంత్ చేసి త్యాగం వృథా కాలేదు. హార్ధిక్ పాండ్యా వరుసగా సిక్స్‌, ఫోర్ బాదాడు. చివరి బంతికి కూడా ఫోర్ కొట్టాడు. అయితే అతని కాలు వికెట్లకు తాకడంతో హిట్‌ వికెట్‌గా ఔట్ అయ్యాడు. దీంతో 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. ఆ తరువాత ఇంగ్లాండ్ 16 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించి.. ఫైనల్లోకి అడుగుపెట్టింది. పాకిస్థాన్‌తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. 


Also Read: Hardik Pandya: హార్ధిక్ పాండ్యా వికెట్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..   


Also Read: Ravindra Jadeja: భార్యకు ఎమ్మెల్యే టికెట్ దక్కడంపై రవీంద్ర జడేజా హ్యాపీ.. ట్విట్టర్‌లో సందేశం  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook