Ravindra Jadeja: భార్యకు ఎమ్మెల్యే టికెట్ దక్కడంపై రవీంద్ర జడేజా హ్యాపీ.. ట్విట్టర్‌లో సందేశం

Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బరిలోకి దిగుతున్నారు. జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ పడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2022, 03:40 PM IST
Ravindra Jadeja: భార్యకు ఎమ్మెల్యే టికెట్ దక్కడంపై రవీంద్ర జడేజా హ్యాపీ.. ట్విట్టర్‌లో సందేశం

Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు అస్త్రలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారం రంగంలోకి దూకేందుకు రెడీ అవుతున్నాయి. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలను రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 1న 89 స్థానాలకు, మిగిలిన 93 స్థానాలకు డిసెంబర్ 5న ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జాడేజా భార్య రివాబా జడేజాకు బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించింది.

ఈ విషయంపై రవీంద్ర జడేజా స్పందించాడు. గుజరాత్ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కడంపై ఆమెకు అభినందనలు తెలిపాడు. ఆమె కష్టపడుతున్న తీరును చూసి గర్వపడుతున్నానని అన్నాడు. సమాజాభివృద్ధికి ఇలాంటి కృషి చేస్తూనే ఉండాలని ఆకాంక్షించాడు. అదేవిధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపాడు. ఆసియా కప్ సందర్భంగా గాయపడిన జడేజా.. అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న ఈ స్టార్ ఆల్ రౌండర్ త్వరలోనే జట్టుతో చేరే అవకాశం ఉంది.

 

మరోవైపు ఇదే స్థానం నుంచి రవీంద్ర జడేజా సోదరి నైనా జడేజాను కాంగ్రెస్ బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. 2019 ఏప్రిల్‌లో కాంగ్రెస్‌లో చేరిన ఆమె.. అప్పటి నుంచి రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ప్రస్తుతం జామ్‌నగర్ కాంగ్రెస్ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి రివాబా జడేజాకు టికెట్ కన్ఫార్మ్ కావడంతో.. నైనా జడేజా పోటీ చేయడం ఖాయమని చర్చ జరుగుతోంది. 

ఇక జామ్‌నగర్(నార్త్) నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మేంద్ర సింగ్‌ను కాదని రివాబా జడేజాయకు బీజేపీ టికెట్ కేటాయించింది. 2012లో కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలుపొందిన ఆయన.. 2017లో బీజేపీలో చేరి.. ఆ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ సారి కూడా ధర్మేంద్ర సింగ్ తనకు మళ్లీ టికెట్ వస్తుందని ఆశతో ఉండగా.. అధిష్టానం ఝలక్ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ చేరదామని అనుకున్నా.. ఆ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. ఇక కాంగ్రెస్‌లోకి వెళ్లే ఛాన్స్ లేదు. దీంతో ఆయన ఇక ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Also Read: Naga Shaurya Marriage: నాగశౌర్య పెళ్లి ఫిక్స్.. మరో పది రోజుల్లోనే... అమ్మాయి ఎవరంటే

 Also Read: Pawan Kalyan: ముళ్లును ముళ్లుతోనే తీసినట్లు.. వేమన విగ్రహం తొలగింపుపై పద్యం రూపంలో పవన్ కౌంటర్   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News