India vs England: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఫైట్ ఆసక్తికరంగా సాగుతోంది. టెస్ట్ సిరీస్‌ సమం కాగా..టీ20 సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. ఇక వన్డే సిరీస్‌ హోరాహోరీగా జరుగుతోంది. తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించగా..రెండో వన్డేలో ఇంగ్లీష్‌ జట్టు ప్రతికారం తీర్చుకుంది. తొలి మ్యాచ్‌లో అన్నివిభాగాల్లో టీమిండియా రాణించి..విజయఢంకా మోగించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐతే రెండో వన్డేలో బౌలింగ్ పరంగా అద్భుతంగా ఆడినా..బ్యాటింగ్‌లో తేలిపోయింది. దీంతో వంద పరుగుల తేడాతో ఓడిపాలయ్యింది. ఇప్పుడు మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. రేపు(ఆదివారం) ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్‌ జరగనుంది. మాంచెస్టర్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఇరు జట్లు అన్నివిభాగాల్లో పటిష్ఠంగా ఉంది. దీంతో ఆఖరి మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.


టీమిండియాకు బ్యాటింగ్ విభాగం కలవర పెడుతోంది. కోహ్లీ ఫామ్‌లో లేకపోవడంతో జట్టుకు ఇబ్బందిగా మారింది. ఐతే జట్టు యాజమాన్యం మాత్రం అతడిపైనే భరోసా ఉంచింది. కోహ్లీ అద్భుత ఆటగాడని..ఇందులో ఎలాంటి సందేహం లేదని ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశారు. మూడో వన్డేలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. రెండో వన్డేలో ఆడిన టీమ్‌తోనే మైదానంలోకి దిగే పరిస్థితి ఉందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.


ఇటు ఇంగ్లండ్‌ మంచి ఊపు మీద ఉంది. రెండో వన్డేలో ఆ జట్టు ఘన విజయం సాధించింది. అదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. మొదటి, రెండో వన్డేలో బ్యాటింగ్‌ విభాగం ఘోరంగా విఫలమైంది. రెండో వన్డేలో బౌలర్లు అద్భుతంగా రాణించడంతో గెలుపు రుచి చూశారు. మొత్తంగా ఇంగ్లండ్‌ జట్టులోనూ ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. తమ బ్యాటింగ్‌పై ఎలాంటి గందరగోళం లేదని ఇప్పటికే ఆ జట్టు యజమాన్యం స్పష్టం చేసింది.


Also read:Harish Rao Review: ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి..వైద్యాధికారులకు హరీష్‌రావు ఆదేశం..!


Also read:Revanth Reddy: వరదలను జాతీయ విపత్తుగా చూడండి..ప్రధాని మోదీకి రేవంత్‌ రెడ్డి లేఖ..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook