Tim Paine 150 dismissals in Tests: ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ అరుదైన ఘనత సాధించాడు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ వికెట్ కీపర్ టీమ్ పైన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లలో పాలు పంచుకున్న వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు టీమ్ పైన్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అడిలైడ్ వేదికగా భారత్(Team India)‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ టీమ్ పైన్(Tim Paine) అందుకున్నాడు. తద్వారా టెస్టుల్లో 150 వికెట్లలో పాలు పంచుకున్న కీపర్‌ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌ను వెనక్కి నెడుతూ అత్యంత వేగంగా ఈ రికార్డు నమోదు చేసిన కీపర్‌‌గా నిలిచాడు పైన్. కాగా, 89 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా స్కోరు 273/5.


Also Read: Ajinkya Rahane కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వెల్లువ



దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌ 34వ టెస్టు ఇన్నింగ్స్‌లో 150 వికెట్ల మైలురాయిని అందుకోగా, ఆస్ట్రేలియా కీపర్ టీమ్ పైన్ (Tim Paine) 33 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డు చేరుకోవడం విశేషం. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం అందుకు వేదికగా మారింది. ఆ తర్వాత ఆడం గిల్‌క్రిస్ట్ 36 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ చేరుకున్నాడు. సఫారీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ 38వ ఇన్నింగ్స్‌లో 150 వికెట్ల క్లబ్‌లో చేరాడు.


Also Read: India Vs Australia: తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆసీస్ ఆలౌట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook