Virat Kohli Batting Highlights Video vs Pakistan: టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, కింగ్ విరాట్‌ కోహ్లీ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడు. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న సమయంలో కూడా క్లాస్ ఇనింగ్స్ (82 నాటౌట్‌; 53 బంతుల్లో 6×4, 4×6) ఆడి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. పాకిస్తాన్ పేసర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. తన అనుభవాన్ని ఉపయోగించి టీమిండియాకు అద్భుత విజయం అందించాడు. చేజింగ్‌లో తనకంటే ఎవరూ బాగా ఆడలేరని క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

160 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 31 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో 1×4, 2×6)తో కలిసి కోహ్లీ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. పాక్ బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటూ.. 113 పరుగుల భాగస్వామ్యంను నెలకొల్పి తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు. ఇక భారత్ విజయానికి చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు చేయాల్సి వచ్చింది. దాంతో భారత్ గెలవడం ఇక కష్టమే అనిపించింది. తీవ్ర ఒత్తిడి ఉన్నా.. షహీన్‌ ఆఫ్రిది వేసిన 18వ ఓవర్లో కోహ్లీ మూడు బౌండరీలు బాదాడు. 


ఇక భారత్ చివరి 2 ఓవర్లలో 31 పరుగులు చేయాలి. 19వ ఓవర్లో హరీష్ రవూఫ్‌ మొదటి 4 బంతుల్లో 3 పరుగులే ఇచ్చాడు. దాంతో సమీకరణం 8 బంతుల్లో 28 పరుగులుగా మారింది. విరాట్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా బాదేశాడు. ఈ సిక్స్‌లు చాలాచాలా హెల్ప్ అయ్యాయి. చివరి 6 బంతులకు 16 రన్స్ చేయాలి. హార్దిక్‌ పాండ్య స్ట్రైకింగ్‌లో ఉండగా.. మొహ్మద్ నవాజ్‌ బంతిని అందుకున్నాడు. తొలి బంతికే హార్దిక్‌ క్యాచ్ ఔట్ అయ్యాడు. రెండో బంతికి దినేష్ కార్తీక్‌ సింగిల్ మాత్రమే తీశాడు. మూడో బంతికి కోహ్లీ రెండు పరుగులే చేశాడు. దాంతో సమీకరణం 3 బంతుల్లో 13 పరుగులుగా మారింది. 



నాలుగో బంతిని మొహ్మద్ నవాజ్‌ ఫుల్‌టాస్‌ వేయగా.. విరాట్ కోహ్లీ సిక్సర్ బాదేశాడు. అది నోబాల్‌ కావడంతో.. భారత్ 3 బంతుల్లో 6 పరుగులే చేయాల్సి వచ్చింది. అదనంగా ఫ్రీహిట్‌ వచ్చింది. నాలుగో బంతికి వైడ్‌. మరుసటి (నాలుగో) బంతికి కోహ్లీ బౌల్డయినా.. ఫ్రీహిట్‌ కావడంతో కోహ్లీ, డీకే మూడు పరుగులు తీశారు. భారత్ విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఐదో బంతికి కార్తీక్‌ స్టంపౌట్‌ అవ్వడంతో విజయం దోబూచులాడింది. వైడ్ అనంతరం ఆర్ అశ్విన్ సింగల్ తీసి ఉత్కంఠకు తెరలేపాడు. భారత క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కోహ్లీ ఇన్నింగ్స్‌కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


Also Read: విరాట్ కోహ్లీ భయ్యా ఏం ఆడావ్.. నీకంటే తోపు ఎవరూ లేరు ఈడ: హార్దిక్ పాండ్యా


Also Read: Sitrang Cyclone Alert: దూసుకొస్తున్న సిత్రాంగ్ తుఫాన్.. ఏపీకి గండమేనా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి