Kohli - Hardhik: విరాట్ కోహ్లీ భయ్యా ఏం ఆడావ్.. నీకంటే తోపు ఎవరూ లేరు ఈడ: హార్దిక్ పాండ్యా

Hardik Pandya huge praise on Virat Kohli after 82 runs against Pakistan. పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఆకాశానికి ఎత్తేశాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 24, 2022, 11:43 AM IST
  • పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్‌
  • విరాట్ కోహ్లీ భయ్యా ఏం ఆడావ్
  • నీకంటే తోపు ఎవరూ లేరు ఈడ
Kohli - Hardhik: విరాట్ కోహ్లీ భయ్యా ఏం ఆడావ్.. నీకంటే తోపు ఎవరూ లేరు ఈడ: హార్దిక్ పాండ్యా

Hardik Pandya paise on Virat Kohli after 82 runs vs Pakistan in T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (82 నాటౌట్‌; 53 బంతుల్లో 6×4, 4×6)ని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఆకాశానికి ఎత్తేశాడు. హారిస్‌ రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన రెండు సిక్స్‌లు చాలా ప్రత్యేకం అని, ఒకవేళ ఆ సిక్సులు కొట్టకపోతే మ్యాచ్‌ దూరమై ఉండేదన్నాడు. కోహ్లీ భయ్యా అద్భుతంగా ఆడాడని, ఒత్తిడిలో అతడికంటే బాగా ఆడగల తోపు ఎవరూ లేరు అని పాండ్యా పేర్కొన్నాడు. కోహ్లీతో సహా పాండ్యా (40; 37 బంతుల్లో 1×4, 2×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో పాలుపంచుకున్నాడు. 

మ్యాచ్‌ అనంతరం విరాట్‌ కోహ్లీతో హార్దిక్‌ పాండ్యా ప్రత్యేకంగా మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పాండ్యా మాట్లాడుతూ... 'పాకిస్తాన్ పేసర్ హారిస్‌ రవూఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్స్‌లు చాలా కీలకం. ఆ సమయంలో సిక్సులు పడకుంటే.. మ్యాచ్‌ ఓడిపోయేవాళ్లం నేను చాలా సిక్స్‌లు కొట్టాను. కానీ కోహ్లీ బాదిన ఆ రెండు సిక్స్‌లు చాలాచాలా ప్రత్యేకం. అవే టీమిండియాను విజయం వైపు తీసుకెళ్లాయి. నేను చాలా మంది క్రికెటర్లతో ఆడా. ఇలాంటి రెండు షాట్లు మాత్రం కోహ్లీ తప్పించి మరెవరూ కొట్టినట్లు నాకు గుర్తులేదు' అని అన్నాడు. 

'మ్యాచ్‌లో అత్యుత్తమం విషయం ఏంటంటే.. తీవ్రంగా ఇబ్బందిపడి మరీ విజయం సాదించాం. ఆ అనుభూతి ఓ అద్భుతం. లక్ష్య ఛేదన సందర్భంగా నేను, విరాట్ కోహ్లీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. క్రీజులో చివరి వరకు ఉంటే మ్యాచ్ గెలుస్తామని నమ్మాము. పాక్‌ బౌలర్లను ఏ నిమిషంలో కూడా తక్కువగా అంచనా వేయలేదు. చాలా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. చివరి ఓవర్లలో డ్రెస్సింగ్‌ రూమంతా ఒత్తిడిలో ఉంది. నావరకైతే మైదానంలోకి వచ్చేసరికి నా మైండ్‌ మొద్దుబారిపోయింది. ఇది మంచే చేసింది. ఎందుకంటే ఒత్తిడి దరిచేరకుండా ఉపయోగపడుతుంది' హార్దిక్ చెప్పాడు. 

'కీలక సమయంలో నేను రిస్క్‌ తీసుకొన్నా. ఒత్తిడి రాకుండా ఉండేందుకు చూశా. నా లక్ష్యం చాలా సింపుల్‌. జీవితం సులభతరం కావడానికి ఏం చేయాలో దానిని చేయడానికి సిద్ధంగా ఉంటా. కోహ్లీ భయ్యా నువ్ చాలాసార్లు ఇలా ఆడావు. ఎన్నో మ్యాచులు గెలిపించావ్.  నీకంటే ఒత్తిడిని హ్యాండిల్‌ చేయగల సమర్థులు మరొకరు లేరు. నీకో పెద్ద నమస్కారం' అని హార్దిక్‌ పాండ్యా ప్రశంసలు కురిపించాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. 

Also Read: చివరి బంతికి సింగల్ తీసిన అశ్విన్.. స్మార్ట్ టీవీ పగలగొట్టిన అభిమాని! వీడియో చూస్తే బిత్తరపోతారు

Also Read: 'మొహ్మద్ నవాజ్' నువ్వే మా హీరో.. నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం! లవ్ యూ భయ్యా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News