Sitrang Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడింది. తీరం వైపు దూసుకొస్తోంది. ఆదివారం సాయంత్రం తుపానుగా మారిన సిత్రాన్..బంగ్లాదేశ్ తీరం వైపునకు కదులుతోంది. తీరానికి వచ్చే లోపు ఇది మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం లోపలి నుంచే బంగ్లాదేశ్ వైపు పయనిస్తోందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్‌కు వాయువ్యంగా 475 కిలోమీటర్ల దూరంలోని సాగర్ ద్వీపానికి దక్షిణ-ఆగ్నేయంగా 780 కిలో మీటర్లు, బంగ్లాదేశ్‌లోని బారిసల్‌కు దక్షిణంగా 880 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అక్టోబరు 25 మంగళవారం తెల్లవారుజామున బంగ్లాదేశ్‌కు చెందిన టింకోనా ద్వీపం, శాండ్‌విప్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Deep depression over west-central Bay of Bengal intensified into cyclonic storm 'Sitrang' at 1730hrs near lat16.40N&long 88.10E,580km Sagar Island south&740km south-southwest of Barisal(Bangladesh),to move north-northeastwards&cross Bangladesh coast b/w Tinkona Island&Sandwip:IMD pic.twitter.com/G8XBXaQObr
— ANI (@ANI) October 23, 2022
ఈ తుఫాన్ కు సిత్రాంగ్ గా పేరు పెట్టారు. సిత్రాంగ్ పేరును థాయ్‌లాండ్ దేశం సూచించింది. ఈ సిత్రాంగ్ తుఫాన్ బంగ్లాదేశ్ తీరం దాటే ముందు తీవ్రరూపం దాల్చొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సిత్రాంగ్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఉత్తర కోస్తా ఒడిశాలో ఒకచోట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతం తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ.
ఆంధ్రప్రదేశ్ లో సిత్రాంగ్ గండం ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ మాత్రం ఏపీపై సిత్రాంగ్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని చెబుతోంది. అయినా అధికారులు ముందస్తుగా గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో ప్రమాదకర హెచ్చరికలు జారీ చేశారు.విశాఖ, నిజాంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
Also Read : Munugode Bypoll: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై దాడి! మూడు సభలు.. ఆరు గొడవలతో మునుగోడులో రచ్చరచ్చ
Also Read : Manchu Vishnu - Prabhas : పెళ్లి చేసుకుంటాడో లేదో గానీ.. ప్రభాస్ మీద మంచు విష్ణు సెటైర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sitrang Cyclone Alert: దూసుకొస్తున్న సిత్రాంగ్ తుఫాన్.. ఏపీకి గండమేనా?
దూసుకొస్తున్న సిత్రాంగ్ తుపాను
మంగళవారం ఉదయం తీరం దాటే ఛాన్స్
ఏపీకి ముప్పు లేదన్న ఐఎండీ