Monty Panesar On Virat Kohli Captaincy: చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘోర పరాభవం చెందిన టీమిండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు మొదలయ్యాయి. ఇటీవల ఆస్ట్రేలియాలోనూ తొలి టెస్టులో భారత్ దారుణ ఓటమితో కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు రావడం తెలిసిందే అయితే తొలి టెస్టు జరిగిన చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనున్న రెండో టెస్టులోనూ భారత్ ఓటమిపాలైతే విరాట్ కోహ్లీ కచ్చితంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటాడని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లాండ్‌తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ సేన ఏకంగా 277 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైందని తెలిసిందే. రెండో టెస్టులోనూ అదే ఫలితం వస్తే మాత్రం విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్టు కెప్టెన్సీని వదిలేస్తాడని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ జోస్యం చెప్పాడు. ఒకవేళ అదే జరిగితే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆశల్ని భారత్ వదులుకోగా, కివీస్‌తో ఫైనల్లో ఇంగ్లాండ్ తలపడనుంది. 


Also Read: Team India పేసర్ ఇషాంత్ అరుదైన ఘనత, Kapil Dev, జహీర్ తర్వాత లంబూ


విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘అతడు చాలా ప్రతిభ గల బ్యాట్స్‌మన్. కానీ అతడి కెప్టెన్సీలో టీమిండియా టెస్టుల్లో విజయాలు అందుకోలేకపోతోంది. అదే సమయంలో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు. చివరి నాలుగు టెస్టుల్లోనూ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ ఓడిపోయింది. ప్రస్తుతం కోహ్లీ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. చెపాక్‌లో జరగనున్న రెండో టెస్టులో తొలి టెస్ట్ ఫలితం వస్తే స్వయంగా కోహ్లీనే Team India కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటాని’ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు.


Also Read: IPL 2021: సంపాదనలో MS Dhoni అరుదైన ఘనత, ఐపీఎల్‌లో ఏకైక క్రికెటర్‌గా CSK Captain


కాగా, ఇటీవల ఆస్ట్రేలియా గడ్డ మీద జరిగిన తొలి టెస్టులో టీమిండియా దారుణ వైఫల్యం చెందింది. అనంతరం పెటర్నటీ లీవ్‌పై విరాట్ కోహ్లీ భారత్‌కు తిరిగొచ్చేశాడు. అదే సమయంలో తనకు దొరికిన అవకాశాన్ని అజింక్య రహానే సద్వినియోగం చేసుకున్నాడు. మరో ఓటమి మాట లేకుండా భారత జట్టులో మనోస్థైర్యాన్ని నింపి బోర్డర్-గవాస్కర్ ట్రోఫిని అందించాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook