Virat Kohli: కూతురి ఫొటో షేర్ చేసిన Anushka Sharma, పాప పేరేంటో తెలుసా

 భారత్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ఇటీవల తల్లిదండ్రులయ్యారు. తమ జీవితంలో ఉన్న ఒక్క లోటును తీర్చుకున్న విరుష్కలు చాలా సంతోషంగా ఉన్నారు. తమ ప్రేమను ముద్దుల కూతురు ఇప్పుడు మరో స్థాయికి తీసుకెళ్లిందంటున్నారు.

Virat Kohli Anushka Sharma Name Their Daughter Vamika: భారత్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ఇటీవల తల్లిదండ్రులయ్యారు. తమ జీవితంలో ఉన్న ఒక్క లోటును తీర్చుకున్న విరుష్కలు చాలా సంతోషంగా ఉన్నారు. తమ ప్రేమను ముద్దుల కూతురు ఇప్పుడు మరో స్థాయికి తీసుకెళ్లిందంటున్నారు.

1 /5

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ జనవరి 11న ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ పండంటి పాపకు జన్మనివ్వడం తెలిసిందే. తాజాగా ఆ చిన్నారికి నామకరణం చేసింది విరుష్క జోడీ. తమ ముద్దుల తనయకు వామికా అని పేరు పెట్టారు. (Virat Kohli Twitter Photo) Also Read: IPL 2021: అత్యధికంగా ఆర్జించిన భారత క్రికెటర్లు వీరే

2 /5

‘మేము పరస్పరం ఒకరిపై మరొకరం ప్రేమగా, కృతజ్ఞతతో కలిసి జీవించాము. ఈ చిన్నది, వామికా మా ప్రేమను సరికొత్త స్థాయికి తీసుకువెళ్ళింది! కన్నీళ్లు, నవ్వు, ఆందోళన, ఆనందం - కొన్ని నిమిషాల వ్యవధిలో అనుభవించిన భావోద్వేగాలు’ అని ట్వీట్ చేసింది అనుష్క శర్మ(Anushka Sharma).  (Photo: Anushka Sharma Twitter)

3 /5

మా(అనుష్క శర్మ, నా) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందంటూ ఇటీవల ట్వీట్ చేశాడు కోహ్లీ. ‘మాకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మాపై చూపిన ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకుగానూ ధన్యవాదాలు. ప్రస్తుతం పాప, అనుష్క ఆరోగ్యంగా ఉన్నారని’ తన పోస్టులో విరాట్ కోహ్లీ జనవరి 11న వెల్లడించాడు. (Virat Kohli Twitter Photo) Also Read: IND vs ENG: వ్యాక్సిన్‌పై సందేహాలు వద్దంటున్న ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ

4 /5

నిండు గర్భిణిగా ఉన్న సమయంలో అనుష్క శర్మ (Anushka Sharma)  మాత్రం కఠినమైన ఆసనాలను వేశారు. అనుష్క శీర్షాసనం (Anushka Sharma Shirshasanam) వేసిన సమయంలో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. అనుష్క శర్మ భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆమెకు ఆసనం వేయడంలో సహాయం చేయడం తెలిసిందే. (Anushka Sharma Instagram)

5 /5

2017 డిసెంబర్ 11న ఇటలీలో కోహ్లీ, అనుష్కల వివాహం జరిగింది. కేవలం ఇరు కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నామన్న శుభవార్తను ఎట్టకేలకు పంచుకున్నారు. (Virat Kohli Twitter Photo) Also Read: టాప్ హీరోయిన్లు బ్యాక్‌లెస్ డ్రెస్సులో సన్నింగ్ లుక్స్