ICC World Test Championship Final: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి Team India అవకాశాలు ఇవే

  గతేడాది ప్రారంభించిన ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ తుది అంకానికి చేరువైంది. ఇదివరకే న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఫైనలిస్టు కోసం కివీస్ ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మరో ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఫోకస్ చేశాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 3, 2021, 07:10 PM IST
  • ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ తుది అంకానికి చేరువైంది
  • ఇదివరకే తొలి ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు
  • మరో బెర్త్ కోసం ఇంగ్లాండ్, టీమిండియా, ఆస్ట్రేలియా ఎదురుచూపులు
ICC World Test Championship Final: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి Team India అవకాశాలు ఇవే

ICC World Test Championship Final:  గతేడాది ప్రారంభించిన ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ తుది అంకానికి చేరువైంది. ఇదివరకే న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఫైనలిస్టు కోసం కివీస్ ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మరో ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఫోకస్ చేశాయి.

త్వరలో ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరగనున్న టెస్టు సిరీస్ ఫలితంపై మూడు జట్లు ఆధారపడి ఉన్నాయి. ముందుకు టీమిండియా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి ప్రవేశించేందుకు ఉన్న అవకాశాలను గమనిద్దాం. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్‌కు చేరాలంటే.. ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌ను 2-0, 2-1, 3-0, 3-1, 4-0 తేడాతో భారత్(Team India) సాధించాల్సి ఉంటుంది. ఈ ఫలితాన్ని సాధిస్తే కివీస్‌ను ఫైనల్లో భారత జట్టు ఎదుర్కోంటుంది.

Also Read: ​AP SSC Time Table 2021: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల, AP 10th Time Table

ఇంగ్లాండ్ అవకాశాలను గమనిస్తే.. 
టీమిండియాతో త్వరలో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లాండ్ జట్టు 3-0, 󠁧󠁢󠁥󠁮󠁧󠁿 3-1 లేదా 󠁧󠁢󠁥󠁮󠁧󠁿 4-0 తేడాతో కైవసం చేసుకుంటే ఇంగ్లాండ్ జట్టు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ తొలి ఫైనల్ చేరుకుంటుంది.

 

 

ఆస్ట్రేలియా అవకాశాలు..
కరోనా వైరస్ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా(Australia) అవకాశాలు కూడా సంక్షిష్టంగా మారాయి. ఆస్ట్రేలియా ఫైనల్ చేరాలంటే ఈ కింది సమీకరణాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్‌పై 1-0 తేడాతో టీమిండియా టెస్ట్ సిరీస్ సాధించాలి. లేని పక్షంలో 1-0, 󠁧󠁢󠁥2-0 లేదా 2-1 తేడాతో ఇంగ్లాండ్ నెగ్గాల్సి ఉంటుంది.

Also Read; Abu Dhabi T10: అబుదాబి టీ10 లీగ్‌లో డిఫరెంట్ ఫీల్డింగ్, సోషల్ మీడియాలో Viral Video

 

కాగా, మరో మూడు రకాల అవకాశాలు సైతం ఆసీస్ చేతిలో ఉండటం గమనార్హం. ఇంగ్లాండ్, టీమిండియాల మధ్య జరగనున్న టెస్టు సిరీస్ డ్రాగా ముగియాలి. 0-0, 1-1 లేదా 2-2 తేడాతో ఆ టెస్టు సిరీస్ ముగిస్తే.. ఆసీస్ జట్టు తొలి టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుని కివీస్ జట్టుతో అమీతుమీ తేల్చుకుంటుంది.

Also Read: IPL 2021: సంపాదనలో MS Dhoni అరుదైన ఘనత, ఐపీఎల్‌లో ఏకైక క్రికెటర్‌గా CSK Captain 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News