హామిల్టన్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఉత్కంఠ పోరులో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుపై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 179 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. అనంతరం జరిగిన సూపర్ ఓవర్‌లో చివరి రెండు బంతులకు రోహిత్ శర్మ రెండు భారీ సిక్సర్లు బాది భారత్‌కు టీ20 విజయంతో పాటు సిరీస్‌ను అందించాడు. అయితే ఛేజింగ్‌లో చివరి ఓవర్‌వరకు కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ లాంటి ఆటగాళ్లు క్రీజులో ఉంటడంతో మ్యాచ్ కచ్చితంగా ఓడిపోతామని కోచ్ రవిశాస్త్రికి చెప్పినట్లు మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: నిక్ నేమ్ సీక్రెట్ వెల్లడించిన రికీ పాంటింగ్


అయితే విలియమ్సన్ (95), రాస్ టేలర్ లాంటి కీలక ఆటగాళ్లను బౌలర్ షమీ చివరి ఓవర్‌లో ఔట్ చేయడంతో మ్యాచ్ టై అయ్యి.. తాము రేసులోకి వచ్చామన్నాడు. రోహిత్ శర్మ తొలుత ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడని, ఆపై సూపర్ ఓవర్‌లో రెండు బంతుల్లో 10 పరుగులు అసాధ్యమనుకోగా రెండు భారీ సిక్సర్లతో భారత్‌ను గెలిపించాడని కోహ్లీ చెప్పాడు. కాగా, మ్యాచ్ ఓడిపోతున్నామని తన బ్యాగు సర్దేసుకున్నానని రోహిత్ శర్మ తెలిపాడు. చివరి బంతికి టేలర్ ఔట్ కావడంతో అబ్డమన్ గార్డ్ కోసం 5 నిమిషాలు వెతికానన్నాడు. విలియమ్సన్, టేలర్ లాంటి ఆటగాళ్లు క్రీజులో ఉన్నారని, మ్యాచ్ మా చేజారుతుందని ఆందోళన చెందుతున్న సమయంలో షమీ అద్బుతం చేశాడని రోహిత్ కొనియాడాడు. నిజం చెప్పాలంటే తన రెండు సిక్సర్ల కంటే షమీ చివరి ఓవర్ మ్యాజిక్ బౌలింగే తమకు విజయాన్ని అందించిందని అభిప్రాయపడ్డాడు.


Also Read: తండ్రయిన భారత్ క్రికెటర్.. చిన్నారి ఫొటో వైరల్


సూపర్ ఓవర్‌లో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బంతి అందుకున్నాడు. ఆ ఓవర్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్, మార్టిన్ గుప్టిల్ కలిసి 17 పరుగులుచేశారు. 18 పరుగుల లక్ష్యంతో దిగిన రోహిత్ శర్మ తొలి బంతికి రెండు పరుగులు, రెండో బంతికి సింగిల్ తీశాడు. టిమ్ సౌథీ వేసిన మూడో బంతికి ఫోర్ కొట్టిన కేఎల్ రాహుల్, నాలుగో బంతికి సింగిల్ తీశాడు. మొదటి 4 బంతుల్లో కేవలం 8 పరుగులు చేయగా, భారత్ విజయానికి చివరి 2 బంతుల్లో 10 పరుగులు కావాలి. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రెండు సిక్సర్లు బాదడంతో భారత్ సంబరాల్లో మునిగితేలింది. అయితే విజేతగా నిలిచేందుకు న్యూజిలాండ్ జట్టుకు అర్హత ఉందని, కీలక సమయంలో తాము రాణించి విజయం సాధించామని కోహ్లీ అన్నాడు.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..