Kavya Maran's SHOCKING reaction: ఐపీఎల్ 17వ ఎడిషన్ లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి మాంచి జోరు మీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)కు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bengaluru) ఊహించని ఝలక్ ఇచ్చింది. సన్ రైజర్స్ ను తన సొంతగడ్డపైనే చిత్తు చేసింది. ఆర్సీబీ బౌలర్లు ఆరెంజ్ ఆర్మీ వికెట్లు తీస్తుంటే.. స్టాండ్స్ లో మ్యాచ్ వీక్షిస్తున్న రైజర్స్ ఓనర్ కావ్య మారన్‌ ‌(Kavya Maran) తీవ్ర నిరాశకు గురయ్యింది. ఆమె ముఖంలో నిరాశ, అసహనం కనిపించాయి. ఈ మ్యాచ్ సందర్భంగా కావ్య మారన్ ఇచ్చిన రియాక్షన్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ..
గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో  సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఆర్సీబీ విజయం సాధించింది. వరుసగా ఆరు పరాజయాలు తర్వాత గెలుపుబాట పట్టిండి డుప్లెసిస్ సేన. ఇప్పటికే ఫ్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ఆర్సీబీ ఉప్పల్ మ్యాచ్ లో రెచ్చిపోయింది. గత మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇది ఆర్సీబీకి ఐపీఎల్‌లో 250వ మ్యాచ్‌. ప్రస్తుతం సన్ రైజర్స్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఎనిమిది మ్యాచుల్లో ఐదు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ ఇంకా అట్టడుగునే ఉంది. ఆ జట్టు 9 మ్యాచుల్లో రెండు మాత్రమే గెలిచింది. 



Also read: RCB vs SRH Highlights: ఏం జరిగింది? సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌.. హైదరాబాద్‌ను బెంబేలెత్తించిన బెంగళూరు


తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన బెంగళూరుకు కోహ్లీ (43 బంతుల్లో 51, 4 ఫోర్లు, 1 సిక్స్‌), రజత్‌ పాటిదార్‌ (20 బంతుల్లో 50, 2 ఫోర్లు, 5 సిక్సర్లు), కామెరూన్‌ గ్రీన్‌ (20 బంతుల్లో 37 నాటౌట్‌, 5 ఫోర్లు) అద్భుతంగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన కమిన్స్ సేన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులే చేసింది. హైదరాబాద్ ఆటగాళ్లలో షెహబాజ్ అహ్మద్(40 నాటౌట్), అభిషేక్ శర్మ(31), ప్యాట్ కమిన్స్(31) పరుగులతో రాణించారు. గ్రీన్, కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ రెండేసి వికెట్లు తీశారు. 


Also read: Mumbai Indians PlayOff Chances: ఐపీఎల్ 2024 లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలున్నాయా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook