Facts About Bio-bubble: కరోనా మహమ్మారి ( Coronavirus ) వ్యాపించడం వల్ల అనేక దేశాలు లాక్‌డౌన్ ( Lockdown ) ప్రకటించాయి. దీని వల్ల దాదాపు నాలుగు నెలలుగా క్రికెట్ అభిమానులకు లైవ్ మ్యాచ్ ( Live Match ) చూసే అవకాశం లభించలేదు. అయితే ఇంగ్లాండ్, వెస్టిండీజ్ ( England vs West Indies ) మధ్య నేడు తొలి టెస్టు ప్రారంభం అయ్యే రోజు కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. అయితే ఈ మ్యాచును పూర్తిగా బయోబబుల్  ( Bio-bubble ) సృష్టించినిర్వహిస్తున్నారు. అయితే ఈ బయోబబుల్ అంటే ఏంటో చాలా మంది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. Also Read : England Vs West Indies: ప్రేక్షకులు లేని టెస్టు మ్యాచు గురించి 10 ఆసక్తికరమైన విషయాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

What Is Bio bubble : బయోబబుల్ అంటే ఏంటి ?


బయోబబుల్ అనే పదం గత కొంత కాలంగా బాగా చర్చణీయాంశంగా మారింది. బయోబబుల్ అంటే బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని సురక్షితంగా ఉండటం. కోవిడ్-19 ( Covid-19 ) వ్యాప్తిని గమనించి ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB ) బయోసెక్యూర్ ( Bio Secure ) అనే పర్యావరణాన్ని సృష్టించి ఈ పరిస్థితిలోనే మ్యాచులు నిర్వహించాని నిర్ణయించింది. 


ఆటగాళ్లు ఉన్న ప్రాంతంలో కొంత మందికి మాత్రమే ప్రవేశించే అనుమతి ఉంటుంది. ఆటగాళ్లు, అంపైర్లు, టెక్నీషియన్స్‌ను సురక్షితంగా ఉంచడానికి వారికి తరచూ పరీక్షలు నిర్వహిస్తారు. మీడియా కూడా అక్కడ ప్రవేశించలేదు. అయితే కొంత మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఆటగాళ్ల టెంపరేచర్‌ను ( Body Temperature ) రెగ్యులర్‌గా పరీక్షిస్తారు. Also Read : Prabhas 20: ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల తేదీ తెలిసింది


బయోబబుల్ గురించి ఆటగాళ్లు ఏమనుకుంటున్నారు ?
బయోబబుల్‌ పరిస్థితిలో ప్రాక్టిస్ చేయడం చాలా వింతైన ( Bio-bubble Experience) అనుభవం అని క్రికెటర్లు తెలిపారు. ఏదో సైంటిఫిక్ మూవీలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటున్నారు. అందరి ముఖాలపై మాస్క్‌లు ( Face Mask ) ఉంటున్నాయి. ఎవరు శత్రవులో, ఎవరు స్నేహితుడో తెలుసుకునే అవకాశం లేదు అని తెలుపుతున్నారు. ఇదంతా చాలా కొత్త అనుభవం అని చెబుతున్నారు.


Rahul Dravid About Bio-bubble : రాహుల్ ద్రావిడ్ ఎలా స్పందించారు…
కరోనావైరస్ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో క్రికెట్‌ను ఇంత త్వరగా ప్రారంభించడంపై మాజీ భారత క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ( Rahul Dravid ) స్పందించారు. ఈసీబీ సృష్టించిన బయోబబుల్‌‌ విధానం పాటించడం అందరి వల్ల సాధ్యం కాదు అని… నాణ్యతమైన క్రికెట్ కోసం మరికొంత కాలం ఆగితే బాగుంటుంది అని సూచించారు ద్రావిడ్. 
 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..