5G Services launch: సుదీర్ఘ నిరీక్షణ ఆగింది. 5జి ఇంటర్నెట్ సేవలు ఇండియాలో ప్రారంభం కానున్నాయి. మరో వారం రోజుల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా 5జీ సేవలు లాంచ్ కానున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్నెట్ 5జీ సేవల కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. ఇప్పటికే 5జి స్పెక్ట్రమ్ ఆక్షన్ పూర్తయి..వివిధ కంపెనీలు 5జి సేవల లాంచ్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అటు యూజర్లు ఎప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆ నిరీక్షణ తొలగిపోయంది. దేశంలో 5జి సేవలు మరో వారం రోజుల్లోనే అంటే అక్టోబర్ 1న దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఈ సేవల్ని ప్రారంభించనున్నారు. ఐటీ అండ్ ఇన్‌ఫర్మేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే 5జి సేవల ప్రారంభంపై స్పందించారు. 5 జీ సేవలు దేశంలోని అన్ని ప్రాంతాలకు 2-3 ఏళ్లలో చేరుకుంటాయని తెలిపారు.


ఆగస్టు నెలలో 5జి స్పెక్ట్రమ్ వేలంలో 1.50 లక్షల కోట్లు లభించాయి. స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో, అదానీ గ్రూప్, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు పాల్గొన్నాయి. 7 రోజుల పాటు నడిచిన వేలంలో మొత్తం 40 రౌండ్ల వేలం జరిగింది. 


Also read: Apple Diwali Sale 2022: దీపావళికి ముందే యాపిల్ ఆఫర్లు, ఐఫోన్ కొంటే ఎయిర్‌పాడ్స్ ఉచితం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook