Airtel New Plan: దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు అతిపెద్ద టెలీకం కంపెనీలుగా మార్కెట్ కలిగి ఉన్నాయి. రెండు కంపెనీలు ఒకదాన్ని మించి మరొక ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు, నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగానే ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టి కొత్త ప్లాన్ అందర్నీ ఆకర్షిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ కేవలం 148 రూపాయల ప్రీ ప్రెయిడ్ ప్లాన్. ఇందులో అద్భుతమైన డేటా, కాలింగ్‌తో పాటు 15 ఓటీటీ యాప్స్‌కు యాక్సెస్ ఉంటుంది. ఆశ్యర్యంగా ఉంది కదూ..ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునేవారికి ఇది మంచి అవకాశం. ఈ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.


ఎయిర్‌టెల్ 148 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ కస్టమర్లకు 15 జీబీ డేటా అందిస్తుంది. ఇది కస్టమర్లు ప్రస్తుతం కలిగి ఉన్న ప్రీ పెయిడ్ ప్లాన్‌కు యాడ్ ఆన్ అవుతుంది. దీనివల్ల వాలిడిటీ, డేటా రెండూ పెరుగుతాయి. టాక్ టైమ్, ఎస్ఎంఎస్ లాభాలే కాకుండా ఈ డేటా ప్యాక్‌తో మరో అద్భుతమైన ప్రయోజనం కూడా ఉంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో 15 ఓటీటీ యాప్స్‌కు యాక్సెస్ ఉంటుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే అనేది ఓ ఎంటర్‌టైన్‌మెంట్ వేదిక. ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో కస్టమర్లు చాలా ఓటీటీ సేవలు పొందవచ్చు.


ప్రముఖ ఓటీటీలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా, జీ5, వూట్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, ఎఎల్‌టి బాలాజీ, ఎరోస్ నౌ, హోయ్‌కోయ్, హంగామా ప్లే, సన్ ‌నెక్ట్స్, షిమారూ మి, లైన్స్‌గేట్ ప్లే, టీవీఎఫ్ ప్లే వంటి యాప్స్ లభిస్తాయి 


రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మధ్య ఉన్న పోటీ నేపధ్యంలో ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన 148 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ కస్టమర్లకు కచ్చితంగా ఆకర్షించనుంది. ఈ డేటా ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుంటుంది. 


Also read: FD Interest Rates: పెద్ద బ్యాంకులు కూడా ఇవ్వలేని విధంగా 9.50 వడ్డీ ఇస్తున్న బ్యాంకులివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook